»   » బాహుబలికి ముందే ‘డైనమైట్’ పేల్చేందుకు ప్లాన్

బాహుబలికి ముందే ‘డైనమైట్’ పేల్చేందుకు ప్లాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ సినిమా జులై 10న విడుదలవుతున్న నేపథ్యంలో ఇతర సినిమాలన్నీ జాగ్రత్త పడుతున్నాయి. బాహుబలి ప్రభంజనం తట్టుకోవడం కష్టమే అని ముందే ఊహించిన దర్శక నిర్మాతలు తమ సినిమాలు ఆ సినిమాతో కనీసం వారం గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా మంచు విష్ణు నటించిన ‘డైనమైట్' మూవీని బాహుబలి సినిమా విడుదలకు ఒక వారం ముందు... జులై 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన కూడా విడుదలైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై దేవాకట్టా దర్శకత్వం యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ‘డైన‌మైట్' సినిమాని రూపొందించారు.


'Dynamite' release on 3rd July

విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో కనువిందు చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుని చేశారు. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్ర‌ణీతహీరోయిన్‌గా న‌టించింది.


మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ అందించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్ర‌యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇటీవల అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై3న వరల్డ్ వైడ్ గా సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Vishnu Manchu’s Dynamite movie plans to hit theatres on July 3rd a week before Baahubali.
Please Wait while comments are loading...