twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏక్ మినీ కథ షాకింగ్ బిజినెస్.. చిన్న బడ్జెట్‌తో భారీ లాభాలు.. ప్రభాస్ నమ్మకం నిజమయ్యింది!

    |

    ఒకప్పుడు బాలీవుడ్ లోనే బోల్డ్ కంటెంట్ కథలకు మంచి క్రేజ్ ఉండేది. తెలుగులో అలాంటి కంటెంట్స్ వస్తే ఎదో ఒక వివాదం తెరపైకి వచ్చేది. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఆ వివధాలు తగ్గడంతో బోల్డ్ సినిమాలకు మంచి బూస్ట్ లభించింది. ఇక ఏక్ మినీ కథ వివాదాలకు తావివ్వకుండా డిఫరెంట్ బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా బిజినెస్ కు ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

    Recommended Video

    Ek Mini Katha Film బోల్డ్ గా కొత్తగా | Santosh Shoban And Kavya Fun Moments | Filmibeat Telugu
    హీరో ప్రయివేట్ పార్ట్ చిన్నదిగా ఉంటే

    హీరో ప్రయివేట్ పార్ట్ చిన్నదిగా ఉంటే

    ఏక్ మినీ కథ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి కూడా ప్రేక్షకుల్లో విబిన్నంగా ప్రమోట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒక హీరో ప్రయివేట్ పార్ట్ చిన్నదిగా ఉంటే ఆ తరువాత అతను ఎదుర్కొనే అనుభవాలు ఎలా ఉంటాయి అనేది కథలోని అసలు పాయింట్. దర్శకుడు మెర్లపాక గాంధీ రాసిన ఈ కథను కార్తిక్ డైరెక్ట్ చేశాడు. టీజర్ ట్రైలట్ రెండు కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి.

    ఎలాగైనా సక్సెస్ అవ్వాలని

    ఎలాగైనా సక్సెస్ అవ్వాలని

    ఈ మూవీలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. వర్షం సినిమా దర్శకుడు శోభన్ కొడుకైనటువంటి సంతోష్ ఇదివరకే తను నేను - పేపర్ బాయ్ అనే సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఏక్ మినీ కథతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

    ప్రభాస్ నమ్మకం నిజమయ్యింది

    ప్రభాస్ నమ్మకం నిజమయ్యింది

    ఈ సినిమా సెట్టవ్వడానికి ప్రధాన కారణం ప్రభాస్. వర్షం ద్వారా వచ్చిన హిట్ ను మర్చిపోలేని ప్రభాస్ ఆదర్శకుడి కొడుకు కెరీర్ కోసం ఏదైనా మంచి అవకాశం ఇప్పించాలని ఆ బాధ్యతను యూవీ క్రియేషన్స్ కు అందించారు. దీంతో వాళ్ళు సంతోష్ శోభన్ కోసం ఈ బోల్డ్ కంటెంట్ ను సెలెక్ట్ చేశారు. సినిమా తప్పకుండా మంచి బజ్ క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ముందు నుంచి నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు అదే నిజమయ్యింది.

    బడ్జెట్ ఎంతంటే..

    బడ్జెట్ ఎంతంటే..

    ఇక ఈ సినిమాను మొదట థియేటర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. దీంతో ఓటీటీ ఆఫర్స్ కు తలొగ్గక తప్పలేదు. శాటిలైట్ ద్వారా కూడా సినిమాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇక సినిమాను యూవీ క్రియేషన్స్ వారే నిర్మించారు. యూవీ కాన్సెప్ట్ అనే న్యూ బ్యానర్ ను క్రియేట్ చేసి మొత్తం 4.31కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించారు.

     ఇక వచ్చిన మొత్తం లాభం ఎంతంటే..

    ఇక వచ్చిన మొత్తం లాభం ఎంతంటే..

    ఏక్ మినీ కథ కోసం ముందు నుంచి కూడా ఓటీటీ సంస్థలు చాలానే పోటీ పడ్డాయి. ఇక అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ రిలీజ్ హక్కులను 9.32కోట్లకు దక్కించుకుంది. ఇక శాటిలైట్ పరంగా సినిమాకు ఒక ప్రముఖ ఛానెల్ 3.86కోట్లను ఇచ్చినట్లు సమాచారం. ఈ విధంగా సినిమా పెట్టిన బడ్జెట్ మినహాయిస్తే 8.37కోట్ల వరకు ప్రాఫిట్స్ దక్కినట్లు సమాచారం.

    English summary
    The much awaited Prabhas 20th movie First Look has finally been released. UV Creations, which has been making fans a little impatient for years due to delays, got a good kick out of the whole first look. The title of Radheshyam has been fixed for the movie as everyone expected. The First Look title is currently trending on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X