For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  3 years for F2 movie: 35 కోట్లకు వచ్చింది 80 పైనే.. అన్ని కోట్ల లాభాలతో సంచలన రికార్డు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. పండుగ మూడు రోజులూ రెండు రాష్ట్రాల్లో సందడి వాతావరణం ఉండడంతో పాటు సెలవులు కూడా వస్తాయి. దీంతో అప్పుడు విడుదలయ్యే చిత్రాలకు భారీ రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్'తో సంక్రాంతికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెగ సందడి చేశారు.

  ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలైన నేటికి మూడేళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

  వాళ్లతో కలిసి సందడి చేసిన అల్లుళ్లు

  వాళ్లతో కలిసి సందడి చేసిన అల్లుళ్లు

  2019లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ 'F2: Fun and Frustration'. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మూవీలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా చేశారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది.

  దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

  అన్ని ఏరియాల బిజినెస్ జరిగిందిలా

  అన్ని ఏరియాల బిజినెస్ జరిగిందిలా

  భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'F2: Fun and Frustration' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది మంచి డీల్స్ చేసుకుంది. ఫలితంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని ఈ చిత్రానికి రూ. 34.50 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

  వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన 'F2' మూవీ ముగింపు సమయానికి.. నైజాంలో రూ. 23.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.60 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7.28 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.57 కోట్లు, గుంటూరులో రూ. 5.70 కోట్లు, కృష్ణాలో రూ. 5.30 కోట్లు, నెల్లూరులో రూ. 2.10 కోట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.93 కోట్లు షేర్‌ రాబట్టి సత్తా చాటుకుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 'F2: Fun and Frustration' మూవీ ముగింపు సమయానికి రూ. 67.93 కోట్లు రాబట్టింది. అలాగే, కర్నాటకలో రూ. 4.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 9.38 కోట్లను వసూలు చేసింది. ఇలా ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 84.51 కోట్ల షేర్‌ను వసూలు చేసుకుంది.

  బ్రేక్ ఈవెట్ టార్గెట్.. లాభాలెంతంటే

  బ్రేక్ ఈవెట్ టార్గెట్.. లాభాలెంతంటే

  'F2: Fun and Frustration' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 35.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి ఏకంగా రూ. 84.51 కోట్లు వసూలు చేసింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు భారీ స్థాయిలో యాభై కోట్ల రూపాయల వరకూ లాభాలను కూడా సొంతం చేసుకుని రికార్డులు కొట్టింది.

  టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

  అన్ని కోట్ల లాభాలతో మోత మోగించి

  అన్ని కోట్ల లాభాలతో మోత మోగించి

  ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'F2' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన రావడంతో ఏకంగా రూ. 50 కోట్ల లాభాలు వచ్చాయి. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ లాభాలను అందుకున్న చిత్రాల జాబితాలో ఇది చోటు దక్కించుకుంది. 'బాహుబలి 1, 2'తో పాటు 'అల.. వైకుంఠపురములో', 'గీత గోవిందం' తర్వాత 'ఎఫ్' మూవీనే చోటు దక్కించుకుంది.

  English summary
  Daggubati Venkatesh, Varun Tej Movie F2 - Fun and Frustration Movie Under Anil Ravipudi Direction. This Movie Collected Rs 84.51 Crore in Full Run.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X