Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
F3 12 Days Collections: పడిపోతున్న కలెక్షన్స్.. ఈ వసూళ్ళతో హిట్ కష్టమే?
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'F2' సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఆ ప్రకటనకు తగినట్టు సీక్వెల్‌గా F3 అనే మూవీని రూపొందించారు. ఇక అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ కావడంతో పాటు, హిట్ కాంబినేషన్ కావడంతో సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ కూడా జరిగింది. భారీ అంచనాలతో మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం బాక్స్ ఆఫీస్ రిపోర్టులో చూద్దాం పదండి.

మల్టీస్టారర్ F3
టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'F3'. ఈ సినిమాలో సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగులో మంచి టేస్ట్ ఉన్న నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. అంత క్రేజ్ ఉంది కాబట్టే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో
'ఎఫ్ 3'కు 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. 11వ రోజు కంటే కూడా కలెక్షన్లు పడిపోయి. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 లక్షల షేర్ రాబట్టింది.

12 రోజులకు కలిపి
'ఎఫ్ 3'కి 12 రోజులకు కలిపి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 17.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.76 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.28 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.39 కోట్లు, గుంటూరులో రూ. 3.17 కోట్లు, కృష్ణాలో రూ. 2.78 కోట్లు, నెల్లూరులో రూ. 1.72 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 42.65 కోట్లు షేర్, రూ. 68.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా
ఆంధ్ర, తెలంగాణలో సత్తా చాటిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 12 రోజులకు రూ. 42.65 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.89 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే ఈ మూవీ రూ. 52.54 కోట్లు షేర్, రూ. 88.06 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇంకా ఎంత కావాలంటే
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్ 3' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ బిజినెస్ ప్రకారం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.54 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 11.96 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. అయితే ఈవారం కూడా నాని అంటే సుందరానికీ సహా పలు సినిమాలు విడుదలకు ఉండడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.