twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 20 Days Collections: దారుణంగా దిగజారుతున్న కలెక్షన్స్.. ఇక హిట్ అసాధ్యమే?

    |

    విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'F2' సూపర్ హిట్ గా నిలవడంతో సీక్వెల్ అప్పట్లోనే ప్రకటించారు. అలా ప్రకటించినట్టుగానే ఆ సినిమాకి సీక్వెల్‌గా F3 అనే మూవీని భారీ స్టార్ క్యాస్టింగ్ తో రూపొందించారు అదే టీమ్. ఇక సీక్వెల్ ప్రకటించిన నాటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించడంతో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. భారీ అంచనాలతో మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 20 రోజుల్లో ఎంత వసూలు చేసిందో బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం!

    మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ తో

    మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ తో

    టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా మల్టీస్టారర్ మూవీ 'F3'. ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించగా సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    భారీగా డ్రాప్

    భారీగా డ్రాప్

    'ఎఫ్ 3'కు 19వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ కాగా 20వ రోజు మరింత డ్రాప్ కనిపించింది. ఈ క్రమంలో నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. లక్ష లోపు, వెస్ట్‌లో రూ. 1 లక్ష, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. లక్ష లోపు కలెక్షన్స్ తో రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 12 లక్షల షేర్ రాబట్టింది.

    20 రోజులకు

    20 రోజులకు

    'ఎఫ్ 3' మూవీకి 20 రోజులకు కలిపి కలెక్షన్లు బాగానే వచ్చాయని చెప్పాలి. అయితే బిజినెస్ కు తగినట్లు మాత్రం కలెక్షన్స్ కనిపించడం రాలేదు. 20 రోజులకు కలిపి నైజాంలో రూ. 18.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.10 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.41 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.46 కోట్లు, గుంటూరులో రూ. 3.28 కోట్లు, కృష్ణాలో రూ. 2.89 కోట్లు, నెల్లూరులో రూ. 1.75 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 44.20 కోట్లు షేర్, రూ. 71.25 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల్లో

    ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల్లో

    20 రోజులకు ఆంధ్ర, తెలంగాణలో సత్తా చాటిన 'ఎఫ్ 3' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో 20 రోజులకు రూ. 44.20 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.03 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.12 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా 20రోజుల్లోనే ఈ మూవీ రూ. 54.35 కోట్లు షేర్, రూ. 91.27 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ఇంకా ఎన్ని కోట్లు సాధించాలంటే?

    ఇంకా ఎన్ని కోట్లు సాధించాలంటే?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్ 3' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేయడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 64.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 54. 35 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 10.15 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. ఈ సినిమా ఆ స్టేటస్ అందుకోవడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. విరాటపర్వం, గాడ్సే ఎంట్రీ ఇస్తే ఇక పూర్తి స్థాయిలో కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది.

    English summary
    Daggubati Venkatesh, Varun Tej starrer F3 Movie under Anil Ravipudi Direction Collected Rs Crores in 54. 35 20 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X