»   » ‘రుద్రమదేవి’ అడ్వాన్స్ బుకింగ్ హౌస్ ఫుల్!

‘రుద్రమదేవి’ అడ్వాన్స్ బుకింగ్ హౌస్ ఫుల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కంచిన చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి' చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోతోంది. అక్టోబర్ 9న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో పలువురు సినీ లవర్స్ ఆన్ లైన్లో టికెట్లను హాట్ కేకుల్లా కొనేసారు. ఆన్ లైన్ అమ్మకాలతో దాదాపు అన్ని థియేటర్లు వీకెండ్ వరకు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ఆశిస్తున్నారు.

మరో వైపు సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ రుద్రమదేవి టీం తిరుమల శ్రీవారి పాదాల ముందు తొలి కాపీ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కించారు.


Good advance bookings for Rudhramadevi

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు /ఏ సర్టిఫికేట్ పొందింది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు గుణశేఖర్ తెలిపారు.


ఈ సినిమాను స్పెషల్ బెనిఫిట్ షోను హైదరాబాద్ లోని శ్రీమాములు థియేటర్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9వ తేదీ తెల్లవారు ఝామున 1 గంట నుండి 3 గంటల మధ్యలో షో వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షో టికెట్స్ కావాల్సిన వారు 8374095398, 8142011679 నంబర్లను సంప్రదించవచ్చు.


Good advance bookings for Rudhramadevi

ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ సినిమాలో హైలెట్ కాబోతున్నాడు. చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Rudhramadevi movie aggressive promotions and the superb visuals in the latest trailers have resulted in solid advance bookings for the film in the Telugu states.
Please Wait while comments are loading...