Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హౌస్‌ఫుల్ 4 కలెక్షన్ల సునామీ.. ఐదు రోజుల్లోనే అబ్బురపరిచే ఫీట్
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హౌస్‌ఫుల్ 4 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 26వ తేదీన విడుదలైన ఈ సినిమా ఐదు రోజుల్లోనే అబ్బురపరిచే ఫీట్ సాధించింది. తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ 4 జోష్ కొనసాగుతోంది. మొదటి షో నుంచి మొదలుకొని ఐదు రోజుల పాటు ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ కనిపించలేదు.

బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అయ్యేలా హౌస్ ఫుల్
ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో హౌస్ ఫుల్ 4 సినిమా రూపొందింది. హౌస్ ఫుల్ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో కృతి సనన్, అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్, కృతి కర్భందా, రితీష్ దేశ్ ముఖ్, దగ్గుబాటి రానా తదితరులు నటించారు. డిఫరెంట్ కాథాంశం, నటీనటుల పని తీరు బీ టౌన్ ఆడియన్స్‌ని మెప్పించాయి.

ఐదు రోజుల్లోనే హౌస్‌ఫుల్ 4
దీంతో కేవలం ఐదు రోజుల్లోనే హౌస్‌ఫుల్ 4 సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయి రికార్డు సృష్టించింది. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఐదో రోజూ అదే స్పీడ్ కొనసాగించింది. 5 వ రోజైన మంగళవారం 24 కోట్లు కొల్లగొట్టింది హౌస్‌ఫుల్ 4.

5 రోజుల వసూళ్లు చూస్తే..
అక్టోబర్ 26వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజే 19.08 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వరుసగా శనివారం 18.81 కోట్లు, ఆదివారం 15.33 కోట్లు, సోమవారం 34.56 కోట్లు, మంగళవారం 24.04 కోట్లు రాబట్టింది. మొత్తంగా చూస్తే ఇప్పటిదాకా 111.82 కోట్లు రాబట్టింది హౌస్‌ఫుల్ 4 సినిమా.

అక్షయ్ కుమార్ కెరీర్‌లో..
బాలీవుడ్
లో
స్టార్
హీరోగా
కొనసాగుతున్న
అక్షయ్
కుమార్
కెరీర్‌లో
100
కోట్ల
క్లబ్‌లో
చేరిన
ఐదో
సినిమాగా
హౌస్‌ఫుల్
4
సినిమా
నిలిచింది.
గతంలో
ఆయన
నటించిన
2.0,
గోల్డ్,
కేసరి,
మిషన్
మంగళ్
సినిమాలు
ఈ
ఫీట్
సాధించాయి.
ఇందులో
మూడు
సినిమాలు
(కేసరి,
మిషన్
మంగళ్,
హౌస్‌ఫుల్
4)
ఈ
ఏడాది
విడుదలైన
సినిమాలే
కావడం
విశేషం.