»   » సంక్రాంతి విన్నర్ బాలయ్యే: ‘జై సింహ’ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియా వైజ్...

సంక్రాంతి విన్నర్ బాలయ్యే: ‘జై సింహ’ క్లోజింగ్ కలెక్షన్స్ ఏరియా వైజ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి బాక్సాఫీసు రేసులో నువ్వా నేనా అనే విధంగా పోటీ పడ్డారు నట సింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరి సినిమాలు విడుదల తర్వాత బాలయ్యే విన్నర్ అని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' భారీ ప్లాప్ అవ్వగా... బాలయ్య 'జై సింహ' పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటింది. తాజాగా 'జై సింహ' చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ వివవరాలు బయటకు వచ్చాయి.

కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా సీకే ఎంటర్‎టైన్‎మెంట్స్ బ్యానర్‎పై నిర్మితమైన ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో

తెలంగాణ(నైజాం) ప్రాంతంలో బాలకృష్ణ ‘జై సింహ' చిత్రం రూ. 5.25 కోట్ల షేర్ సాధించింది.

సీడెడ్ ఏరియాలో

సీడెడ్ ఏరియాలో

బాలయ్య చిత్రాలకు సీడెడ్ ఏరియాలో మంచి డిమాండ్ ఉంది. ఈ చిత్రం ఇక్కడ రూ. 6.20 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో...

ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో...

‘జై సింహ' చిత్రం వెస్ట్ గోదావరిలో రూ. 2.25 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.35 కోట్ల షేర్ రాబట్టింది.

కృష్ణా జిల్లాలో

కృష్ణా జిల్లాలో

బాలయ్య సొంత జిల్లా కృష్ణాలో ‘జై సింహ' చిత్రం వసూళ్ల పంట పండించింది. ఇక్కడ ఈచిత్రం రూ. 2.15 కోట్ల షేర్ రాబట్టింది.

గుంటూరులో

గుంటూరులో

గుంటూరు జిల్లాలో ‘జై సింహ' చిత్రం రూ. 3.30 కోట్ల షేర్ వసూలు చేసింది.

నెల్లూరులో

నెల్లూరులో

నెల్లూరు జిల్లాలో కూడా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఈ చిత్రం ఇక్కడ రూ. 1.45 కోట్ల షేర్ రాబట్టింది.

 ఉత్తరాంధ్రలో...

ఉత్తరాంధ్రలో...

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ‘జై సింహ' చిత్రం రూ. 4.30 కోట్ల షేర్ వసూలు చేసింది.

 ఏపీ తెలంగాణల్లో....

ఏపీ తెలంగాణల్లో....

ఏపీ తెలంగాణల్లో ‘జై సింహ' చిత్రం రూ. 28.25 కోట్ల షేర్ వసూలు చేసింది.

 కర్నాటకలో దుమ్మురేపిన జై సింహ

కర్నాటకలో దుమ్మురేపిన జై సింహ

కర్నాటకలోనూ ‘జై సింహ' మూవీ దుమ్ము రేపింది. ఈ చిత్రం ఇక్కడ రూ. 4.30 కోట్ల షేర్ రాబట్టింది.

 ప్రపంచ వ్యాప్తంగా

ప్రపంచ వ్యాప్తంగా

‘జై సింహ' చిత్రం రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, రెస్టాఫ్ వరల్డ్ లో రూ. 0.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 0.85 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 35.85 కోట్లు రాబట్టింది.

English summary
Jai Simha closing collections details released. Balakrishna surprised everyone with his emotional avatar in the film and made the film a roaring hit and profitable venture for the producer C Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu