twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్...రిలీజ్ మళ్లీ వాయిదా? కొత్త డేట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'ఉత్తమ విలన్‌'. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కె.బాలచందర్‌ కీలకపాత్ర పోషించారు. కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌, నాజర్‌, ఎంఎస్‌ భాస్కర్‌ తదితరులు కూడా నటించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఆడియో విడుదల వేడుక ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రెండు భాషల్లోనూ చిత్రాన్ని ఈ నెల పదో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ముహూర్తం 17వ తేదీకి మార్చారు. ఇప్పుడు 24కు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్ల సమస్య, తెలుగు వెర్షన్‌ పనుల కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం.

    Kamal's Uttama Villain postponed to April 24th?

    ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్‌ పిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న విభిన్న చిత్రం ‘ఉత్తమ విలన్‌'. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

    కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ''సాగరసంగమం, స్వాతిముత్యం సినిమాలు చూస్తే దర్శకుడిగా కె.విశ్వనాథ్‌కీ, నటుడిగా కమల్‌ హాసన్‌కీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుస్తుంది. ఆయనలాంటి మంచి దర్శకుడు దొరికితే ఏ నటుడైనా నాలాగే అవుతాడు. నా గురువుగారు కె.బాలచందర్‌ మీద రాసిన కవితను'ఉత్తమ విలన్‌' తమిళ ఆడియో వేడుకలో వినిపించా. అంతటి పాండిత్యం నాకు తెలుగులో లేదు.

    ఆ కవితని రామజోగయ్యశాస్త్రి అర్థం చేసుకొని తెలుగులో అనువదించారు. ఆయనకి నా కృతజ్ఞతలు. చాలా ఏళ్ల క్రితం అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం 30 వేల పాటల్ని పూర్తి చేసుకొన్నారన్న విషయం తెలిసింది. అప్పటికి అదో రికార్డు. ఈ విషయాన్ని సభాముఖంగా చెబుదామనుకొన్నా అప్పట్లో. అన్నయ్య నన్ను వారించాడు. రికార్డులు సృష్టించడం తప్ప బ్రేక్‌ చేయడం మన పని కాదు అన్న విషయం నా బుర్రకు అప్పుడు అర్థమైంది''అన్నారు.

    Kamal's Uttama Villain postponed to April 24th?

    ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. ఇందులో మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. 14వ శతాబ్ధానికి చెందిన కళాకారుడిగా, నేటి ట్రెండ్‌కు తగిన ఓ సుప్రీంస్టార్‌గానూ ఇందులో నటించారు కమల్‌. అయితే మూడో పాత్రనే అత్యంత గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్‌.

    ఇందులో కమల్‌ గురువు 'దర్శకశిఖరం' కె.బాలచందర్‌ ముఖ్య భూమిక పోషించారు. అందువల్లే ఈ సినిమా కోసం కమల్‌ అభిమానులు మాత్రమే కాకుండా.. కె.బాలచందర్‌ కుటుంబీకులు, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ తొలివారంలో సినిమాను తెరపైకి తీసుకురానున్నారు

    జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల కానున్నాయి. ‘ఉత్తమ విలన్‌', ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

    మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఉత్తమవిలన్‌', ‘విశ్వరూపం-2' సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

    కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

    దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    'Uttama Villain' directed by Ramesh Arvind would hit the screens on April 10, after being postponed for his earlier release date of April 2. But the latest news is that the team will decide the date of release after the censor and it will be on April 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X