»   » ‘కాటమరాయుడు’ సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్! (ఏరియా వైజ్ డీటేల్స్)

‘కాటమరాయుడు’ సెకండ్ డే కలెక్షన్స్ డ్రాప్! (ఏరియా వైజ్ డీటేల్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' ఈ నెల 24న విడుదలైన సూపర్బ్ ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. తొలి రోజు భారీ రెస్పాన్స్ తో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈచిత్రం కలెక్షన్లు రెండో రోజు డ్రాప్ అయ్యాయి.

డాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ 1500 స్క్రీన్లలో విడుదలైంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగానే జరిగింది. అయితే సినిమా విడుదలైన తర్వాత సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అటు క్రిటిక్స్ నుండి, ఇటు ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన రావడంతో తొలి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు కలెక్షన్స్ బాగా తగ్గాయి.

డ్రాప్ కావడానికి కారణం ఏమిటి?

డ్రాప్ కావడానికి కారణం ఏమిటి?

తొలి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ప్రదర్శించే స్క్రీన్ల సంఖ్య కూడా బాగా తగ్గడం, సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

రెండ్రోజుల్లో ఎంత?

రెండ్రోజుల్లో ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో కాటమరాయుడు తొలి రెండు రోజుల్లో మొత్తం రూ. 27 కోట్లు(షేర్) వసూలు చేసినట్లు తెలుస్తోంది.

నైజాం

నైజాం

నైజాం ఏరియాలో తొలి రెండు రోజుల్లో రూ. 5. 9 కోట్లు వసులూ చేసినట్లు సమాచారం. ఇందులో నాలుగు కోట్లు తొలి రోజే వచ్చాయట.

సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో తొలి రెండు రోజుల్లో రూ.3.9 కోట్లు వసూలు చేసింది. ఇందులో మూడు కోట్లకు పైగా తొలి రోజు వసూళ్ల రూపంలోనే వచ్చిందట.

నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో తొలి రెండు రోజుల్లో 1.45 కోట్లు వసూలు చేసింది. ఇందులో కోటికి పైగా తొలి రోజే వసూలైనట్లు సమాచారం.

గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో తొలి రెండు రోజుల్లో 3.2 కోట్లు వసూలు చేసింది. ఇందులో రెండు కోట్లకు పైగా తొలి రోజు వసూళ్ల రూపంలో వచ్చాయట.

కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలో తొలి రెండు రోజుల్లో దాదాపు 2 కోట్ల పై చిలుకు వసూలు చేసింది. ఇందులో కోటిన్నరకు పైగా తొలి రోజు వసూళ్ల రూపంలోనే వచ్చాయట.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 3.13 కోట్లు వసూలు చేసింది. ఇందులో రెండు కోట్లకు పైగా తొలి రోజే వచ్చాయట.

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి జిల్లాలో తొలి రెండు రోజుల్లో 3.8 కోట్లు వసూలయ్యాయి. ఇందులో రెండున్నర కోట్లకు పైగా తొలి రోజు వసూళ్ల రూపంలోనే వచ్చినట్లు సమాచారం.

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో తొలి రెండు రోజుల్లో 3.7 కోట్లు వసూలైంది. ఇందులో రెండు కోట్లకు పైగా తొలి రోజు వసూళ్ల రూపంలో వచ్చిటన్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
Pawan Kalyan's Katamarayudu, which opened to a superb response on Friday, showed a steep decline in its collection at the worldwide box office on Saturday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu