twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫ్ టాక్... రీమేక్ రైట్స్ అమ్ముడుపోయాయి

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమాకు ఫ్లాఫ్ టాక్ వచ్చిందంటే శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. అయితే కథ బాగుంది ఎందుకో వర్కవుట్ కాలేదు...మన భాషలో వర్కవుట్ అవుతుంది అనుకున్నప్పుడు పరభాషా నిర్మాతలు రైట్స్ తీసుకుని కొద్ది పాటి మార్పులతో తమ భాషలోకి రీమేక్ చేసుకుంటూంటారు. అలాంటిదే ఇప్పుడు హర్షవర్థన్‌ రాణే, అవంతిక, సుష్మ, నందిని రాయ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మాయ' కి జరుగుతోంది. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నిర్మాత మధురా శ్రీధర్ తెలియచేసారు.

    ముఖ్యంగా సరైన పబ్లిసిటీ లేకపోవటంతో ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. దాంతో సినిమా గురించి మాట్లాడుకునేవారే కరువు అయ్యారు. మీడియాలో కూడా ఈ చిత్రం గురించి పాజిటివ్ బజ్ లేదు. అదే రోజు రిలీజైన మరో చిత్రం రన్ రాజా రన్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ చిత్రానికి టాకే లేకుండాపోయింది. అయితే కన్నడ నిర్మాతలు మాత్రం వాటిని పట్టించుకోకుండా ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొనుక్కోవటానికి వచ్చారు. కన్నడంలో ప్రేమ కథా చిత్రం నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రం కన్నడ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.

    చిత్రం కథేమిటంటే... ఓ టీవీ ఛానెల్ లో ఫీచర్ కరస్పాండెంట్ గా పనిచేసే మేఘన(అవంతిక) కు అతీంద్రియ దృష్టి (ఇఎస్‌పి- ఎక్స్‌ట్రా సెన్సరీ పెర్‌సెప్షన్) కు ఉండటంతో భవిష్యత్ దర్శనం చేయగలుగుతుంది. అయితే ఆమె దురదృష్టమో,అదృష్టమో కానీ అన్నీ చావు సంఘటనలే కనిపిస్తూంటాయి. చిన్నప్పుడే తల్లి చావుని ముందే చూడగలిగిన ఆమె దాన్ని ఆపలేకపోయానని భాధపడుతుంది. ఆమె ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఆమెకు ఫ్యాషన్ డిజైనర్ సిద్దార్ధ వర్మ(హర్ష వర్దన్ రానే) కలిసి పనిచేయాల్సి వస్తుంది.

    ‘Maaya’ to be remade in Kannada

    ఈ సమయంలో ఇద్దరూ ఒకరితో మరొకరు ప్రేమలో పడతారు. ఈ లోగా ఆమెకు తన చిన్ననాటి స్నేహితురాలు పూజ(సుష్మా రాజ్)తో అతనికి ఎంగేజ్ మెంట్ అయ్యిందనే నిజం తెలుస్తోంది. ఏం చేయాలో అర్దంకాక డైలమోలో ఓ రకమైన డిప్రెషన్ లో ఉన్న ఆమెకు మరోసారి భవిష్యత్ దర్శకనం జరుగుతుంది. ఈ సారి ఆమె అతీంద్రియ దృష్టి ద్వారా చూసిన దృశ్యం... ఆమెను పూర్తిగా భయపెడుతుంది. ఇంతకీ ఆమెకు భవిష్యత్ లో ఏ జరగబోతోందని తెలిసింది. దాన్ని తప్పించటానికి ఆమె ఏం చేసింది...చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.

    దర్శకుడు మాట్లాడుతూ ''మనుషుల్లో ఉండే అతీంద్రీయ దృష్టి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు తలెత్తే సంఘర్షణ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. కథతో పాటు కథనంలోని కొత్తదనం ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తుంది'' అన్నారు. చిత్రంలో నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు నటించారు. చిత్రానికి ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి, కూర్పు: నవీన్‌ నూలి, కళ: గొల్లపల్లి బాబ్జి

    English summary
    Madhura Sreedhar tweeted “Kannada remake rights of Maaya bagged by Dhanlaxmi printer Sridhar Reddy & Murugappan. Previously they did PREMA KATHA CHITRAM in Kannada.ThanQ”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X