నాన్ థియేట్రికల్‌గా భారీ ప్రాఫిట్స్ అందుకున్న నారప్ప.. ఇంత మంచి ఆఫర్ వచ్చినందుకే వదులుకోలేదు
విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ఇటీవల భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకీ సినిమా థియేట్రికల్ గా కాకుండా ఓటీటీలో విడుదలవ్వడం అభిమానులను కాస్త అప్సెట్ చేసింది. అయితే ఒక విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలోనే విడుదల చేయడం మంచిది అని చిత్ర యూనిట్ ఆలోచించింది. అమెజాన్ ప్రైమ్ కూడా లాభాలు వచ్చే విధంగానే మంచి డీల్ ను ఆఫర్ చేసింది. ఇక దగ్గుబాటి నిర్మాత సురేష్ బాబు వచ్చిందే లాభం అనుకోని ఓకే చెప్పేశారు.
బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

నిర్మాత నష్టపోకుండా ఉండాలి అంటే
కరోనా లాక్ డౌన్ దెబ్బతో అసలు సినిమాల పరిస్థితి ఎవ్వరికీ అర్థం కావడం లేదు. థియేట్రికల్ లో రిలీజ్ చేయకపోతే బావుండదు అని స్టార్ హీరోలు దర్శకులు నిర్మాతలతో గొడవలు దిగుతున్నారు. ఇక వెంకటేష్ కూడా నారప్ప విషయంలో అదే తరహాలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ నిర్మాత నష్టపోకుండా ఉండాలి అంటే అంతకంటే మరో ఆలోచన లేదని కూల్ అయ్యారు.

సినిమా బడ్జెట్..
ఇక థియేట్రికల్ గా నారప్ప విడుదలై ఉంటే ఏ స్థాయిలో విజయాన్ని అందుకునేదో గాని ఓటీటీ లో విడుదల చేసినందుకు మాత్రం మంచి లాభాలే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద రావాల్సిన ప్రాఫిట్స్ ను సురేష్ బాబు సింగిల్ డే సిట్టింగ్ లో రాబట్టేశారు. సినిమాను 23కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం.
Leaked Shocking Pictures of Indian Celebs Photos

గత ఏడాది నుంచి అమెజాన్ తో చర్చలు
ఇక అమెజాన్ ప్రైమ్ నారప్ప సినిమా హక్కులను అందుకునేందుకు మొదటి నుంచి సురేష్ ప్రొడక్షన్స్ తో టచ్ లోనే ఉంది. మంచి ఎమౌంట్ ఇస్తామని గత ఏడాది నుంచి వెంటపడుతున్నారు. కానీ సురేష్ బాబు వారి ఆఫర్ గురించి ఆలోచించలేదు. థియేటర్స్ తెరచుకున్న తరువాతే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.
Recommended Video

మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే..
ఇక అమెజాన్ ప్రైమ్ మొదట 30కోట్ల వరకు ఇచ్చి డీల్ సెట్ చేసుకోవాలని అనుకుంది. ఇక ఆ తరువాత ఆ లెక్క 40కోట్లకు రావడంతో నిర్మాత కూడా రిస్క్ చేయకుండా ఉండాలని సేఫ్ జోన్ లో ఆలోచించరు. అంటే ఇప్పుడు దాదాపు 17కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్లు లెక్క. ఇక శాటిలైట్ రైట్స్ కూడా రావాల్సి ఉంది కాబట్టి అదొక మరో బోనస్ అని చెప్పవచ్చు. ఈ లెక్కన చూస్తే కొంతమంది నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ కంటే కూడా ఇదే సేఫ్ బిజినెస్ అని ఆలోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











