»   »  మంత్ర మాయ!

మంత్ర మాయ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
విడుదలలో ఆలస్యమయినా కానీ చార్మీ మంత్ర సినిమా బాక్సాఫీస్ వద్ద మాయ చేస్తోంది. ఈ సినిమా విడుదల అయిన సమయం కూడా నిర్మాతలకు కలిసొచ్చింది. మార్కెట్ లో ఉన్న సినిమాలలో హ్యాపీడేస్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం మంత్రకు ప్లస్ పాయింట్ అయింది. హ్యాపీడేస్ విడుదల అయి సెంచరీ దరిచేరుతుండడంతో జనాల దృష్టి మంత్రవైపుకు మళ్లింది. రొటీన్ చిత్రాలకు కాస్తా భిన్నంగా ఉండడం, చార్మీ గ్లామర్ పని చేయడం జనాలను థియేటర్లవైపుకు మళ్లిస్తోంది. ఈ సినిమాలో సన్నివేశాలు అతికించినట్టుగా ఉన్నప్పటికీ కెమరా పనితనం రీ-రికార్డింగ్ అద్భుతంగా ఉండడమే కాకుండా చార్మీ తన అందచందాలతో సినిమాను ఆకట్టుకునేలా చేస్తోంది. తొలివారం 80 శాతం పైగా వసూళ్లతో నిర్మాతకు సంతోషం కలిగించిందని చెప్పవచ్చు. నిజానికి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా థియేటర్లలో విడుదల కావు కానీ మార్కెట్ మహిమ తెలిసిన సినీ జనాలు ఈ సినిమాను పెద్ద స్టార్ సినిమాకు మళ్లే చాలా థియేటర్లలో విడుదల చేయడం కలిసొచ్చింది. మొదటివారంలోనే పాజిటివ్ టాక్ రావడం మున్ముందు వారాలకు టానిక్ లా పనిచేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి రూ.2.5కోట్లతో రూపొందిన ఈ సినిమా పెట్టిన డబ్బును సునాయాసంగానే రాబట్టుకుంటుందని, లాభం కూడా రావచ్చని అనుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X