For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story 9Days Collections: నాగ చైతన్య నేషనల్ రికార్డు.. 32 కోట్ల టార్గెట్‌కు ఎంత వచ్చిందంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. దీని వల్లే రెండు సార్లు లాక్‌డౌన్లు వచ్చాయి. దీంతో షూటింగ్‌లు నిలిచిపోవడం.. సినిమా హాళ్లు మూతపడడం జరిగాయి. ఫలితంగా అటు నిర్మాతలకు.. ఇటు సినీ కార్మికులు, థియేటర్ల యజమానులకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇక, సెకెండ్ వేవ్ తర్వాత చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే విజయాలను అందుకున్నాయి. ప్రతికూల పరిస్థితుల వల్ల కంటెంట్ మంచిగా ఉన్నా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన చిత్రం 'లవ్ స్టోరి'. నాగ చైతన్య.. సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ మూవీ తొమ్మిది రోజుల బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

  నాగ చైతన్య.. సాయి పల్లవిల‘లవ్ స్టొరీ'

  నాగ చైతన్య.. సాయి పల్లవిల‘లవ్ స్టొరీ'

  యువ సామ్రాట్ నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరి'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ దీనికి సంగీతం సమకూర్చాడు. సున్నితమైన ప్రేమకథతో ఇది తెరకెక్కింది.

  ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!

  భారీ అంచనాలు.. రికార్డు స్థాయి బిజినెస్

  భారీ అంచనాలు.. రికార్డు స్థాయి బిజినెస్

  ఆరంభం నుంచే 'లవ్ స్టోరి' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. సెకెండ్ వేవ్ తర్వాత ఇదే రికార్డు స్థాయి బిజినెస్ చేసుకుంది.

  9వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

  9వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

  'లవ్ స్టోరి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజు కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలు వచ్చాయి. దీంతో రూ. 96 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  9 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

  9 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

  'లవ్ స్టోరి'కి 9 రోజులకు ఏపీ, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 11.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.43 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.20 కోట్లు, గుంటూరులో రూ. 1.38 కోట్లు, కృష్ణాలో రూ. 1.20 కోట్లు, నెల్లూరులో రూ. 77 లక్షలతో.. మొత్తం రూ. 23.68 కోట్లు షేర్, రూ. 38.47 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

   ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

  ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

  9 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో రూ. 23.68 కోట్లు కొల్లగొట్టిన 'లవ్ స్టోరి' ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.59 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.64 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 29.91 కోట్లు షేర్‌తో పాటు రూ. 53.10 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

  బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!

  Recommended Video

  Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
  బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

  ఎన్నో అంచనాలతో వచ్చిన 'లవ్ స్టోరి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజులకు కలిపి దీనికి రూ. 29.91 కోట్లు వచ్చాయి. అంటే మరో 2.09 కోట్లు వస్తే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటోంది.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi Did Love Story Movie Under Sekhar Kammula Direction. This Movie Collect 29.91 Cr in 9 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X