twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Story 13Days Collections: చరిత్ర సృష్టించిన చైతూ.. 32 కోట్ల టార్గెట్.. అప్పుడే అంత ప్రాఫిట్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన హిట్ పడడం లేదన్న విషయం తెలిసిందే. సెకెండ్ వేవ్ తర్వాత చాలా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అందులో చాలా తక్కువ మూవీలు మాత్రమే హిట్ స్టేటస్‌ను అందుకున్నాయి. మరికొన్నైతే మంచి టాక్ ఉన్నా.. ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో విజయాన్ని నమోదు చేసుకోలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'లవ్ స్టోరి'. నాగ చైతన్య.. సాయి పల్లవి కలయికలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'లవ్ స్టోరి' మూవీ 13 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

    ‘లవ్ స్టొరీ' అంటూ వచ్చిన చై, పల్లవి

    ‘లవ్ స్టొరీ' అంటూ వచ్చిన చై, పల్లవి

    నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా.. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సున్నితమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే వచ్చింది.

    బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

    అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రీ బిజినెస్

    అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రీ బిజినెస్

    ఆరంభం నుంచే 'లవ్ స్టోరి' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ జరుపుకుంది.

    13వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

    13వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?


    'లవ్ స్టోరి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 13 రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1.50 లక్షలు, గుంటూరులో రూ. 70 వేలు, కృష్ణాలో రూ. 1.30 లక్షలు, నెల్లూరులో రూ. 80 వేలు వచ్చాయి. దీంతో రూ. 18 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ వచ్చింది.

    మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

     13 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

    13 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

    'లవ్ స్టోరీ'కి 13 రోజులకు ఏపీ, తెలంగాణలో మంచి కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 11.89 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.55 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.31 కోట్లు, గుంటూరులో రూ. 1.46 కోట్లు, కృష్ణాలో రూ. 1.31 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో.. మొత్తం రూ. 25.47 కోట్లు షేర్, రూ. 41.46 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

    తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.47 కోట్లు రాబట్టిన 'లవ్ స్టోరీ' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.96 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.76 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే పదమూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 32.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 57.40 కోట్లు గ్రాస్ వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

    అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఎంత వచ్చింది

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఎంత వచ్చింది

    ఎన్నో అంచనాల నడుమ వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజులకు కలిపి దీనికి రూ. 32.19 కోట్లు వచ్చాయి. అంటే రూ. 19 లక్షలు లాభాలు వచ్చాయి. దీంతో నాగ చైతన్య ఖాతాలో మరో హిట్ చేరింది. ఫలితంగా హ్యాట్రిక్‌తో అతడు చరిత్ర సృష్టించాడు.

    English summary
    Naga Chaitanya and Sai Pallavi Did Love Story Movie Under Sekhar Kammula Direction. This Movie Collect 32.19 Cr in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X