»   » రిలీజ్ డేటిచ్చారు..హిట్టైతే కెరీర్ మలుపు తిరిగినట్లే

రిలీజ్ డేటిచ్చారు..హిట్టైతే కెరీర్ మలుపు తిరిగినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :కెరీర్ ప్రారంభం నుంచి వరసగా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో మాత్రమే కనిపించిన నాగ శౌర్య తొలి సారిగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా చేసిన చిత్రం ‘జాదూగాడు'. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఆడియోకి మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగ శౌర్యని మాస్ లుక్ లో చూపిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ని మే 29 గా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా హిట్టైతే ఇక పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోవాలనే ఆలోచనతో హీరో ఉన్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.వి.యన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జాదూగాడు' . ‘చింతకాయల రవి' ఫేమ్‌ యోగేశ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. జాతీయ టెలివిజన్‌ సీరియల్‌ ‘హర హర మహాదేవ'లో పార్వతి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సోనారిక ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.


Naga Shaurya’s ‘Jaadugadu’ gets a release date

దర్శకుడు యోగేశ్‌ మాట్లాడుతూ ‘‘నాగశౌర్య పోషిస్తున్న పాత్ర అతని గత పాత్రలకు భిన్నంగా ఉంటుంది. మాస్‌ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునేవిధంగా అతని పాత్రను తీర్చిదిద్దాం'' అని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని నిర్మాత ప్రసాద్‌ తెలిపారు. ‘‘పూర్తి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. ఈ నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.


కోట శ్రీనివాసరావు, అజయ్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేశ్‌, జాకిర్‌ హుస్సేన్‌, ఆశిశ్‌ విద్యార్థి, రవి కాలే, ప్రభాస్‌ శ్రీను, రాఘవ, అదుర్స్‌ రఘు, సత్య, ఫిష్‌ వెంకట్‌ తారాగణమైన ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

English summary
‘Jaadugadu’ makers are planning to release the film on the 29th of this month. Sonarika is paired opposite Shourya and Yogi of Chintakayala Ravi fame is the director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu