»   » రిలీజ్ అయితే నారా రోహిత్ కు దెబ్బే, పైసా కూడా రాదు

రిలీజ్ అయితే నారా రోహిత్ కు దెబ్బే, పైసా కూడా రాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్, రెజీనా కాంబినేషన్ లో అప్పట్లో 'శంకర' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని విడుదల చేయటానికి నిర్మాతలు రెండేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. అయితే ఇప్పుడు ఇదే కథతో హిందీలో 'అకీరా'చిత్రం తెరకెక్కి, తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదల కానుంది. ఇదే జరిగితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయినా ఫలితం లేకుండాపోతుంది.

దాంతో శంకరా చిత్రాన్నే హిందీ డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. అకీరా కన్నా ముందే శంకర అని అక్కడ రిలీజ్ చేస్తారట. ఇదే నిజమే అయితే ఇంతకన్నా వేస్ట్ పని మరొకటి ఉండదని అంటున్నారు సిని జనం. ఎందుకంటే అకీరాలో ఉన్నది సోనాక్షి, డైరక్ట్ చేసింది మురగదాస్ కాబట్టి క్రేజ్, అంతేకానీ బాలీవుడ్ లో ఎవరికి తెలుసు అని నారా రోహిత్ సినిమా రిలిజ్ చేస్తే జనం రావటానికి అంటున్నారు.

Nara Rohit’s Shankara Will Release Not In Telugu

పూర్తి వివరాల్లోకెళితే.. 'మౌనగురు' టైటిల్ తో 2011లో విడుదలైన ఓ తమిళ చిత్రం అక్కడ స్లో హిట్ అయ్యింది. దాంతో వెంటనే మనవాళ్లు రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో నారా రోహిత్ తో షూటింగ్ మొదలెట్టారు. నారా రోహిత్ కూడా ఈ సినిమాపై నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే రకరకాల కారణాలతో సినిమా షూటింగ్ పూర్తైనా ముందుకు వెళ్లలేదు.

ఇదిలా ఉంటే 'మౌనగురు' సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కు కథ బాగా నచ్చేసింది. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం తీర్చిదిద్దితే ఇంకా బాగుంటుందనిపించింది. వెంటనే రైట్స్ తీసుకుని ఆ కథకి తనదైన స్టైల్ లో మెరుగులు దిద్ది హిందీ తెరమీదికి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. 'అకీరా' టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారి. తాజాగా 'అకిరా' చిత్రం ట్రైలర్‌ విడుదలై సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మురగదాసే నిర్మాత కూడానూ.

ఇప్పటికే మురుగదాస్ కు హిందీలో 'గజినీ', 'హాలీడే' (తెలుగులో తుపాకి) చిత్రాల దర్శకుడిగా మంచి క్రేజ్ ఉంది. దాంతో ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయని బావిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ లోగానే 'శంకర' సినిమాని ఆగష్ట్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

Nara Rohit’s Shankara Will Release Not In Telugu

దర్శకుడు తాతినేని సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ''ఉత్కంఠను కలిగించే ప్రేమ కథతో దీన్ని తీర్చిదిద్దాం. ఇందులో పైట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథకు తగ్గ పేరు కావడంతో 'శంకర' అని నిర్ణయించాం. అటు యువతనీ, ఇటు మాస్‌నీ సమంగా అలరిస్తుంది''అన్నారు. ఆహుతిప్రసాద్‌, జాన్‌ విజయ్‌, రాజీవ్‌ కనకాల, చిన్నా, రాఖీ, సత్యకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కళ: సాహి సురేష్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి.

English summary
Nara Rohit and Regina Cassandra play the lead in Shankara. Shankara, however, will get a release, but in Hindi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu