For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుకున్నట్లే అయ్యింది...వాయిదా పడింది

  By Srikanya
  |

  హైదరాబాద్‌: నితిన్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితం మొదలైన ఈ సినిమా ఆ మధ్యన ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే నితిన్ ఎంటర్ అయ్యి...స్పీడప్ చేసి రిలీజ్ కు రంగం సిద్దం చేసి విడుదల తేదీ ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 న విడుదల చేయాలని నిర్ణయాచారు. మొదట అయితే వాయిదాపడుతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ చిత్రానని సెప్టెంబర్ 17కు ఫోస్ట్ ఫోన్ చేసారని ట్రేడ్ వర్గాల సమాచారం.

  ఈ చిత్రంలో యామి గౌతమ్‌ హీరోయిన్. ప్రేమ్‌ సాయి దర్శకుడు. గురు ఫిలింస్‌ ప్రొడక్షన్‌ సంస్థ తెరకెక్కించింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ లేటుకుకారణం ...సెన్సార్ స్లాట్ అనుకున్నట్లుగా దొరకలేదని అంటున్నారు.

  వరసలో ఏడు చిన్న సినిమాలు సెన్సార్ కు ఎదురుచూస్తూండటంతో సెన్సార్ స్లాట్ దొరకలేదని తెలుస్తోంది. దాంతో మేరక్స్ మిగతా ఆ చిన్న సినిమా నిర్మాతల నుంచి నో అబ్జెక్షన్ లెటర్ కోసం తిరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. వీరంతా ఒప్పుకుంటే సెన్సార్ అయ్యి...ప్రకటించిన తేదీకి విడుదల అవుతుంది.

  దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్‌ బోయ్‌ కథ ఇది. ఓ కొరియర్‌ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్‌, థ్రిల్‌ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.

  Nithiin's Courier Boy Kalyan: postponed again

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ప్రముఖ నిర్మాత గౌతమ్ మీననన్ ఈ 'కొరియర్‌ బోయ్‌ కల్యాణ్‌'కు నిర్మాతగా మారారు. ఈ నెల 19న చిత్ర పాటలు విడుదలవుతున్నాయి. త్వరలో చిత్రం విడుదల తేదీని ఖరారు చేస్తామని నటుడు నితిన్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో యామి గౌతమ్‌ హీరోయిన్ గా గా నటిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 11 న చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని సమాచారం.

  గౌతమ్ మీనన్ మాట్లాడుతూ....''ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా కారణాలున్నాయి. తెలుగులో షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. తమిళంలో జీవా కాల్షీట్లు కావల్సినన్ని దొరకలేదు. రెండు భాషల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనుకొన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు'' అని చెప్పుకొచ్చారు.

  అలాగే ...గౌతమ్‌ మేనన్‌ చెబుతూ ''తెలుగులో నేను నిర్మించిన తొలి చిత్రమిది. కథ నచ్చే ప్రేమ్‌సాయికి అవకాశం ఇచ్చాను. అందరూ తమ వంతు సహకారం అందించారు''అన్నారు.

  నితిన్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం గౌతమ్‌ మేనన్‌, ప్రేమ్‌సాయి చాలా కష్టపడ్డారు. నా దృష్టిలో ఈ సినిమాకి వాళ్లే హీరోలు. సన్నివేశాలు సహజంగా ఉంటాయి. భారతీయ వెండి తెరపై ఇలాంటి కథాంశంతో ఎవ్వరూ సినిమా తీయలేదు. కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది''అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''ఓ కొరియర్‌ బోయ్‌ కథ ఇది. ఓ కొరియర్‌ వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకొన్నాడు, అందులోంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా. వినోదం, యాక్షన్‌, థ్రిల్‌ కలగలిపిన ప్రేమకథ ఇది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన సంగీతం ఆకట్టుకొంటుంది. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తున్నాము''అన్నారు.

  అశుతోష్‌ రాణా, నాజర్‌, సత్యం రాజేష్‌, సప్తగిరి, రవి ప్రకాష్‌, యింటూరి వాసు తదితరులు నటించారు.

  English summary
  Nithin and Yami Gautham starrer Courier Boy Kalyan has been postponed again. The film was scheduled for September 11th release but it has now been pushed to 17th September .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X