Don't Miss!
- Sports
IND vs SA: రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ విఫలం.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- News
ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్ని గ్రామస్తులు: ఒకరు మాజీ బీజేపీ మైనార్టీ నేత, రూ. 5 లక్షల రివార్డ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Jr NTR పాన్ ఇండియా సినిమాలతో కళ్యాణ్ రామ్.. రెమ్యునరేషన్ ఇవ్వకుండా?
జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్డేట్ లతో అభిమానులకు మంచి కిక్ అయితే ఇచ్చాడు. RRR సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ సినిమాతో అలాగే 31 వ చిత్రం తో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి నిర్మాణ బాధ్యతలలో కళ్యాణ్ రామ్ కూడా ఒక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 60 కోట్లకు పైగా తీసుకోవాల్సిన ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఈ రెండు సినిమాలకు కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకు అనే వివరాల్లోకి వెళితే..

RRR సినిమాతో..
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తో బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందకపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమాలపై కూడా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ సక్సెస్ లో రామ్ చరణ్ కూడా ఒక భాగం కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ సోలోగా పవర్ఫుల్ సక్సెస్ అందుకోవాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు.

ఎన్టీఆర్ 30
ఇదివరకే ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా ఒక బలమైన కథతో ఈ ఇద్దరు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా మార్కెట్
ఇక ఎన్టీఆర్ 31వ ప్రాజెక్టును కూడా కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ లోనే తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ కూడా సహా నిర్మాణ సంస్థగా వ్యవహరించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే అన్నయ్య సంస్థలో జై లవకుశ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా ప్రొడక్షన్ హౌస్ ను ఒక భాగం చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలకు కూడా భారీ స్థాయిలోనే ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

రెమ్యునరేషన్ లేకుండా..?
అయితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం ఏమీ తీసుకోవడం లేదు అని సమాచారం. అసలైతే ఎన్టీఆర్ RRR కు 45 కోట్ల వరకూ పారితోషికం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అంతకు మించి 55 కోట్ల నుంచి 60 కోట్ల మధ్యలో తీసుకునే అవకాశం అయితే ఉంది. కానీ కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ లోకి చేరడంతో ఎన్టీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరొక ఒప్పందం..?
కళ్యాణ్ రామ్ తన తమ్ముడికి పారితోషికం ఏమీ ఇవ్వకుండా లాభాల్లో వాటా ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కాబట్టి భారీ స్థాయిలో ప్రొడక్షన్ కాస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి సక్సెస్ అయిన తర్వాత అంతకంటే ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు కూడా షేర్ ఇవ్వడానికి కళ్యాణ్ రామ్ అలాగే మిగతా నిర్మాతలు కూడా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.