»   »  షాక్ :‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కలెక్షన్స్ మరీ ఇంత డ్రాప్?

షాక్ :‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కలెక్షన్స్ మరీ ఇంత డ్రాప్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ప్రీమియర్ షోలు ఓపెన్ అయ్యాయి. అంతేకాదు మహేష్ ..శ్రీమంతుడు చిత్రం ప్రీమియర్ షో రికార్డ్ లను సైతం బ్రద్దలు కొట్టింది. బాహుబలి తర్వాత అమెరికాలో రెండో అతి పెద్ద ఓపెనర్ తెలుగు చిత్రంగా నమోదు అయ్యింది. ఇవన్నీ ఫ్యాన్స్ కు , సినీ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే అంశాలే.

అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఓవర్ సీస్ లో పూర్తి కలెక్షన్స్ పడిపోయినట్లు సమాచారం. మొదటి రోజు ప్రిమియర్ షోలకు యుఎస్ లో $ 6,15,853 కలెక్ట్ చేస్తే...తర్వాత రోజు $ 1,89,624 పడిపోయింది. రెండు రోజుల్లోనే దాదాపు సెవంటీ పర్శంట్ డ్రాప్ అవటంతో ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి అంటున్నారు. పెట్టిన పెట్టుబడి వెనక్కి సగం కూడా తిరిగిరాదని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.


Pawan's Sardaar Collections Show A Big Drop

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా, పవన్‌కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మించారు. పవర్‌స్టార్‌తో కాజల్‌ తొలిసారి జోడీ కట్టింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు.. 2012లో విడుదలైన సంచలన విజయం సాధించిన 'గబ్బర్‌ సింగ్‌' చిత్రానికి ఫ్రాఛైజ్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

English summary
'Sardaar Gabbar Singh' downfall has started for the film in overseas. A drop of nearly 70% revenues in two days goes on to show the kind of impact the negative talk showed on the film's result.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu