»   »  వావ్: మొత్తం వసూళ్లు రూ. 400 కోట్లకు చేరాయి!

వావ్: మొత్తం వసూళ్లు రూ. 400 కోట్లకు చేరాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘ప్రేమ రతన్ దన్ పాయో' చిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. సోమవారం(డిసెంబర్ 1) నాటికి ఈ చిత్రం మొత్తం వసూళ్లు రూ. 400 కోట్ల మార్కను అందుకుంది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇటు ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ మంచి వసూళ్లు సాధించింది.

ఇండియన్ మార్కెట్లో ఈ చిత్రం రూ. 305 కోట్లు వసూలు చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రూ. 93.7 కోట్లు వసూలు చేసింది. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ ప్రేమ్ రతన్ ధన్ పాయో వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపాపారు. ఇండియాలో రూ. 207.4 కోట్ల షేర్ (గ్రాస్ రూ. 305 కోట్లు), ఓవర్సీస్ లో 14.2 మిలియన్ డాలర్లు(రూ. 93.7 కోట్లు గ్రాస్) వసూలు చేసింది. మొత్తం రూ. 398.7 కోట్లు అని ట్వీట్ చేసారు.

Prem Ratan Dhan Payo Crosses Rs 400 Crores

దీపావళి సందర్భంగా విడుదలైన ఈచిత్రం 2015లో సల్మాన్ చేసిన రెండో చిత్రం. తొలి చిత్రం భజరంగీ భాయిజాన్ తో పాటు, ఇపుడు ఈ చిత్రం కూడా రూ. 200 కోట్ల మార్కను అందుకుంది. సల్మాన్ నటిస్తే సినిమా యావరేజ్ అయినా ఈజీగా రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని మరోసారి తేలిపోయింది.

ఇటీవల విడుదలైన రణబీర్ కపూర్-దీపిక పదుకోన్ మూవీ ‘తమాషా' ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాపై ఎలాంటి ప్రభావం చూపలేక పోయింది. త్వరలోనే ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్' లైఫ్ టైమ్ కలెక్షన్ రూ. 422 కోట్ల మార్కను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో అనుపమ్ ఖేర్, అర్మాన్ కోహ్లి, స్వర భాస్కర్, నీల్ నితిన్ ముఖేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

English summary
Salman Khan's Prem Ratan Dhan Payo had opened to mixed reviews by critics and audience, but that hasn't stopped the movie from minting money at the Box Office. Trade analyst, Taran Adarsh tweeted, "#PRDP to cross ₹ 400 cr gross worldwide today. India ₹ 207.4 cr till Mon [₹ 305 cr gr] + Oseas $ 14.2 mn [₹ 93.7 cr gr]. Total: ₹ 398.7 cr."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu