»   » కలెక్షన్లతో దూసుకెళ్తున్న గరుడవేగ.. రాజశేఖర్‌కు డబుల్ ధమాకా..

కలెక్షన్లతో దూసుకెళ్తున్న గరుడవేగ.. రాజశేఖర్‌కు డబుల్ ధమాకా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
కలెక్షన్లతో దూసుకెళ్తున్న గరుడవేగ

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కమ్‌బ్యాక్ మూవీ పీఎస్‌వీ గరుడవేగ చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. రాజశేఖర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన 10 రోజుల కలెక్షన్లు రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్లు కావడం విశేషం. అంతేకాకుండా పెద్ద చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా వసూళ్లను సాధించడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

సెకండ్ వీక్ కలెక్షన్లు కూడా

సెకండ్ వీక్ కలెక్షన్లు కూడా

పీఎస్వీ గురుడ వేగ చిత్రం అమెరికాలో రెండోవారంలో కూడా మంచి కలెక్షన్లను సాధిస్తున్నట్టు ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తున్నది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే ఊపు కొనసాగితే మరిన్ని కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది అనే తెలిపారు.

యూఎస్‌లో కలెక్షన్ల హోరు

యూఎస్‌లో కలెక్షన్ల హోరు

గతవారంలో శుక్రవారం 29,777 డాలర్లు, శనివారం 51,649, ఆదివారం 21,959 డాలర్లను వసూలు చేసింది. మొత్తంగా యూఎస్‌లో 545383 డాలర్లు అంటే 2.97 కోట్లు వసూలు చేసింది అని ట్వీట్టర్‌లో తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.


పది రోజుల్లో కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా గురుడవేగ మంచి కలెక్షన్లను సాధించింది. గత పదిరోజుల్లో ఈ చిత్రం 22 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ చిత్రం ఇప్పటివరకు రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా నిలిచింది.


రాజశేఖర్‌కు డబుల్ ధమాకా

రాజశేఖర్‌కు డబుల్ ధమాకా

టాలీవుడ్ పలు సంవత్సరాలుగా దూరమైన రాజశేఖర్ గరుడవేగతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. సక్సెస్‌తోపాటు భారీ కలెక్షన్లను సొంతం చేసుకొని డబుల్ ధమాకా సాధించాడు. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన పూజాకుమార్, శ్రద్ధాదాస్, సన్నిలీయోన్ తదితరులు నటించారు.


English summary
Hero Rajasekhar's PSV Garuda Vega is doing well in local and overseas centres. According to reports, the film PSV Garuda Vega collected 22 Cr+ World Wide in 10 days. This is certainly very huge for Rajasekhar. The film is the costliest project in the career of Rajasekhar and it is turning out to be the biggest hit in his career too. Praveen Sattaru is the director of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu