twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్బ్... ‘రుద్రమదేవి’ ఫస్ట్ డే కలెక్షన్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి' నిన్న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. సినిమాపై ముందు నుండి అంచనాలు ఉండటం, 3డిలో తెరకెక్కి తొలి తెలుగు చారిత్రాత్మక చిత్రం కావడంతో అన్ని చోట్లా ముందే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి.

    తెలుగులో భారీ ఓపెంనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా రుద్రమదేవి పేరు తెచ్చుకుంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రుద్రమదేవి తొలి రోజు రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు తెలంగాణలో రూ.3.25 కోట్లు వసూలు చేసింది. తెలంగాణలో తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో రుద్రమదేవి 4 వ స్థానంలో నిలిచింది.

    సీడెడ్ ఏరియాలో రుద్రమదేవి దాదాపు రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. మిగిలిన మొత్తం ఆంధ్రా ఏరియాలోలోని ఇతర ప్రాంతాల నుండి వసూలైంది. అమెరికాలో ఓవర్సీస్ వసూళ్లు 4 కోట్లు వచ్చినట్లు సమాచారం. అన్ని ఏరియాల కలెక్షన్స్ కలిపి రుద్రమదేవి సౌతిండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం అంటున్నారు.

    Rudhramadevi First Day Collections

    మనకు చారిత్రక చిత్రాలు చాలా అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు వచ్చినా అవి భక్తిరక ప్రధానంగా ఉండి, అసలు చరిత్రను మరుగుపరిచేలా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో మన తెలుగు జాతి గొప్పతనాన్ని,మన వారసత్వాన్ని గుర్తు చేస్తూ వస్తున్న చిత్రం 'రుద్రమదేవి' . చిన్నప్పటినుంచీ పాఠాల్లో చదువుకున్న ఈ చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంచారు గుణశేఖర్.

    ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

    English summary
    From both the Telugu states Rudhramadevi has grossed a staggering amount of Rs 9.50 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X