»   » ‘రుద్రమదేవి’ పరిస్థితి ఏమిటి? కలెక్షన్లు ఎలా ఉన్నాయి?

‘రుద్రమదేవి’ పరిస్థితి ఏమిటి? కలెక్షన్లు ఎలా ఉన్నాయి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వ బాధ్యతలు వహించడంతో పాటు నిర్మాణ సారథ్యం వహిచి తెరకెక్కించిన త్రీడీ చిత్రం 'రుద్రమదేవి'. సినిమా కోసం గుణశేఖర్ తన శక్తిమేర శ్రమించడంతో పాటు, భారీగానే డబ్బు ఖర్చు పెట్టాడు. విడుదల సమయంలో సినిమా అష్టకష్టాలు ఎదుర్కొన్నా భరించాడు. ఎట్టకేలకు అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దాదాపు 70 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ‘రుద్రమదేవి' చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో బాక్సాఫీసు వద్ద ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. 'బాహుబలి' తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడం, గోన గన్నారెడ్డిగా అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రను అల్లు అర్జున్ పోషించడం 'రుద్రమదేవి'కి క్రేజ్‌ను తీసుకొచ్చాయి.


Rudramadevi gross is nearly 60cr

దసరా సీజన్లో 'రుద్రమదేవి' కలెక్షన్లూ మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో షేర్ రూ. 40 కోట్లకు మించదని టాక్. మరి గుణశేఖర్ పెట్టిన రూ. 70 కోట్ల పెట్టుబడి ఏ మేరకు రికవరీ అవుతుంది అనేది చర్చనీయాంశం అయింది.


ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary
Film Nagar source said that, Rudramadevi gross is nearly 60cr till date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu