»   » ‘రుద్రమదేవి’ ఓవర్సీస్ కలెక్షన్ రిపోర్ట్

‘రుద్రమదేవి’ ఓవర్సీస్ కలెక్షన్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క్ టైటిల్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి' తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా మంచి ఫలితాలు రాబడుతోంది. సినిమా విడుదలైన తొలి వారాంతంలో ఇంప్రెసివ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలి వారాంతం ఈ చిత్రం $7,19,529 [రూ 4.66 కోట్లు] కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని యూఎస్ఏలో డిస్ట్రిబ్యూట్ చేసిన ‘బ్లూ స్కై' సంస్థ వారు ఈ విషయాలను వెల్లడించారు.

మూడు రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించి తెలుగులో టాప్ 3 చిత్రంగా నిలిచింది. ఈచిత్రానికి సంబంధించిన మూడు రోజు కలెక్షన్ వివరాలు ఏరియా వైజ్ వివరాలు నిర్మాతలు విడుదల చేసారు. హిందీలో కూడా ఈ సినిమా విడుదలైంది. ఈ మొత్తం కలిసి రూ. 32 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


Rudramadevi Overseas Collections report

ఈ చిత్రంలో రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ హైలెట్. చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, నాగదేవునిగా బాబా సెహగల్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, టిట్టిబిగా వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా అజయ్ నటించారు.


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary
The Gunasekhar-directed period film Rudramadevi raked in approximately $7,19,529 [Rs 4.66 crores] at the US box office.
Please Wait while comments are loading...