»   » సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలైన తొలిరోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. కొన్ని చోట్ల బాహుబలి, శ్రీమంతుడు రికార్డులను సైతం అధిగమించింది. అయితే సినిమాకు మిక్డ్స్ టాక్ రావడం, రివ్యూలు కూడా యావరేజ్ గా రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్ల జోరు మాత్రం కాస్త తగ్గింది.

అయితే తొలి వారం బాక్సాఫీసు వద్ద సర్దార్ జోరు ఊహించినంత లేక పోయినా....మంచి వసూళ్లు సాధించిందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. తొలి వారం ఏపి-తెలంగాణల్లో కలిపి ఈ చిత్రం రూ. 36.8 కోట్ల షేర్(థియేటర్ రెంట్, ఇతర ఖర్చులు పోగా డిస్ట్రిబ్యూటర్ కు మిగిలిన మొత్తం) సాధించినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ షేర్ రూ. 48 కోట్లకు చేరువలో ఉందని సమాచారం.


సినిమా విడుదలకు ముందు 'సర్దార్' మూవీ రూ. 100 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు ఉండేవి. ఆ అంచనాల ప్రకారమే సినిమాను భారీ ధరకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అయితే తాజా పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం రూ. 100 కోట్లు అందుకోవడం కష్టమే అంటున్నారు. డిస్టిబ్యూటర్లకు నష్టాలు తప్పవనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.


తొలి వారం సర్దార్ ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్ల వివరాలు స్లైడ్ షోలో...


నైజాం

నైజాం


సర్దార్ గబ్బర్ సింగ్ తొలి వారం నైజాంలో రూ. 10.67 కోట్ల షేర్ సాధించింది.


సీడెడ్

సీడెడ్


తొలి వారం సర్దార్ గబ్బర్ సింగ్ సీడెడ్ లో రూ. 7.42 కోట్ల షేర్ సాధించింది.


నెల్లూరు

నెల్లూరు


సర్దార్ గబ్బర్ సింగ్ నెల్లూరులో 1.50 కోట్ల షేర్ సాధించింది.


గుంటూరు

గుంటూరు


సర్దార్ గబ్బర్ సింగ్ గుంటూరు ఏరియాలో తొలి వారం రూ. 3.62 కోట్ల షేర్ సాధించింది.


క్రిష్ణా

క్రిష్ణా


సర్దార్ గబ్బర్ సింగ్ క్రిష్ణా ఏరియాలో తొలి వారం రూ. 2.65 కోట్ల షేర్ సాధించింది.


వైజాగ్

వైజాగ్


వైజాగ్ ఏరియాలో సర్దార్ గబ్బర్ సింగ్ తొలి వారం రూ. 3.94 కోట్ల షేర్ సాధించింది.


వెస్ట్

వెస్ట్


సర్దార్ గబ్బర్ సింగ్ వెస్ట్ గోదావరిలో తొలివారం రూ. 3.55 కోట్ల షేర్ సాధించింది.


ఈస్ట్

ఈస్ట్


ఈస్ట్ గోదావరి ఏరియాలో సర్దార్ గబ్బర్ సింగ్ తొలివారం రూ. 3.45 కోట్ల షేర్ సాధించింది.


English summary
Powerstar Pawan Kalyan's Sardaar Gabbar Singh, which has shattered a few records of Baahubali and Srimanthudu on its first day, has done a snail-paced business at the box-office from the second day, due to the poor reviews and bad mouth talk it has received.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu