»   » బన్నీపై అనుమానాలు, లెక్కలు కరెక్టేనా? (సరైనోడు 10 డేస్ కలెక్షన్స్)

బన్నీపై అనుమానాలు, లెక్కలు కరెక్టేనా? (సరైనోడు 10 డేస్ కలెక్షన్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరైనోడు'. ప్రస్తుతం థియేటర్లలో ఇదొక్కటే స్టార్ హీరో సినిమా ఉండటం, ప్రేక్షకులకు ఇదొక్కటే బెటర్ ఆప్షన్ గా కనిపిస్తుండటంతో బాక్సాఫీసు వద్ద వసూళ్లు బాగానే వస్తున్నాయి.

బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 52 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రూ. 42.02 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమాకు వసూళ్లు బావున్నట్లు చెబుతున్నారు. రెండో వారం కూడా యూఎస్ఏలో సినిమా బాగా ఆడుతుంది. త్వరలోనే 1 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు $ 826,442 [రూ 5.49 కోట్లు] వసూలు చేసింది.

అనుమానాలు, లెక్కలు కరెక్తేనా?
అయితే 'సరైనోడు' కలెక్షన్ల వివరాలపై పలు అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కొన్ని చోట్ల కలెక్షన్లు తక్కువ వస్తున్నా ఎక్కువ చేసి చూపెడుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. బన్నీ కెరీర్లో ఈ చిత్రాన్ని భారీ మాస్ హిట్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

ఆ ఆరోపణల సంగతి పక్కన పెడితే.... ఏరియా వైజ్ 10 డేస్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం

నైజాం


నైజా ఏరియాలో 10 డేస్ షేర్ రూ. 13.97 కోట్లు

సీడెడ్

సీడెడ్


సీడెడ్ ఏరియాలో 10 డేస్ షేర్ రూ. 8.18 కోట్లు

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర


ఉత్తరాంధ్ర 10 డేస్ షేర్ రూ. 4.9 కోట్లు.

గుంటూరు

గుంటూరు


గుంటూరు 10 డేస్ షేర్ రూ. 3.87 కోట్లు.

నెల్లూరు

నెల్లూరు


నెల్లూరు 10 డేస్ షేర్ రూ. 1.64 కోట్లు.

కృష్ణ

కృష్ణ


కృష్ణ 10 డేస్ షేర్ రూ. 2.83 కోట్లు

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి


ఈస్ట్ గోదావరి 10 డేస్ షేర్ రూ. 3. 53 కోట్లు

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి


వెస్ట్ గోదావరి 10 డేస్ షేర్ రూ. 3.10 కోట్లు

English summary
Allu Arjun's Sarainodu did great business at the box-office so far and has collected around 52 Cr share Worldwide, while it managed to garner 42.02 Cr in Andhra Pradesh and Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu