»   » పోటీలేదు, కుమ్మేస్తున్నాడు: ‘సరైనోడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

పోటీలేదు, కుమ్మేస్తున్నాడు: ‘సరైనోడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది. బాక్సాఫీసు వద్ద ఇతర పెద్ద సినిమాల పోటీ లేక పోవడంతో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

'సరైనోడు' చిత్రం విడుదలై గురువారంతో తొలివారం పూర్తయింది. తాజాగా అందుకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. తొలివారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 45 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడం విశేషం.


అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ కావడంతో 'సరైనోడు' చిత్రంపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించారు. ఇది కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది.


తొలిరోజు ఈ చిత్రం ఏపీ, తెలంగాణల్లో డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. 2016 సంవత్సరంలో 'సర్దార్ గబ్బర్ సింగ్', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల తర్వాత బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. సరైనోడు ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఏరియా వైజ్ స్లైడ్ షోలో...


నైజాం

నైజాం

నైజాం ఏరియాలో తొలి వారం సరైనోడు చిత్రం రూ. 11.36 కోట్లు వసూలు చేసింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో సరైనోడు చిత్రం తొలి వారం రూ. 6.80 కోట్లు వసూలు చేసింది.


వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఏరియాలో ఈ చిత్రం తొలివారం రూ. 4.43 కోట్లు వసూలు చేసింది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో ఈచిత్రం తొలి వారం రూ. 2.90 కోట్లు వసూలు చేసింది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో ఈచిత్రం తొలివారం రూ. 2.60 కోట్లు వసూలు చేసింది.


కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలో ఈ చిత్రం రూ. 2.28 కోట్లు వసూలు చేసింది.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో ఈచిత్రం తొలి వారం రూ. 3.24 కోట్లు వసూలు చేసింది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో ఈ చిత్రం తొలివారం రూ. 1.36 కోట్లు వసూలు చేసింది.


కర్ణాటక

కర్ణాటక

కర్ణాటకలో ఈచిత్రం తొలి వారం రూ. 5.96 కోట్లు వసూలు చేసింది.


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియాలో ఈ చిత్రం తొలివారం రూ. 1.09 కోట్లు వసూలు చేసింది.జ


ఓవర్సీస్

ఓవర్సీస్

ఓవర్సీస్ మార్కట్లో ఈచిత్రం తొలివారం రూ. 3.70 కోట్లు వసూలు చేసింది.


టోటల్

టోటల్

సరైనోడు చిత్రం ఇప్పటి వరకు మొత్తం రూ. 45.72 కోట్లు వసూలు చేసింది.
English summary
Sarrainodu first week collections Rs. 45.72 cr. It’s been a week since Stylish Star Allu Arjun’s Sarrainodu hit the screens and with no major competition, the flick is still doing strong in almost all the centers across the two Telugu states.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu