»   » షారూఖ్ ఖాన్ హీరోగా సౌత్ రీమేక్ ఖరారు

షారూఖ్ ఖాన్ హీరోగా సౌత్ రీమేక్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :బాలీవుడ్‌ కథలపై కోలీవుడ్‌,టాలీవుడ్ దర్శకులు, హీరోలు మోజు ప్రదర్శించటం ఒకప్పటి మాట. తెలుగు,తమిళ,మళయాళ కథలతో బాలీవుడ్‌లో కాసుల వర్షాలు కురిపించుకోవటం నేటి ట్రెండ్‌. ఆ ట్రెండ్ ని అనుసరిస్తూ షారూఖ్ ఖాన్ అడుగులు వేస్తున్నారు. విష్ణువర్దన్‌, అజిత్‌ కాంబినేషన్‌లో గత దీపావళి కానుకగా వచ్చిన 'ఆరంభం' చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది.
విమర్శకులను సైతం విస్మయపరిచే వసూళ్లతో దూసుకుపోతుంది. దీనికి ఆశ్చర్యపోయిన బాలీవుడ్‌ హీరోలు పలువురు చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. తనతో హిందీలో రీమేక్‌ చేయాలని విష్ణువర్దన్‌ కోరడంతో ఆయన అంగీకరించినట్లు సమాచారం.

అజిత్‌ పాత్రలో షారుఖ్‌ఖాన్‌ నటించనుండగా, తమిళంలో దగ్గుబాటి రానా పోషించిన పాత్రలో హిందీలో అజిత్‌ కనిపించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అజిత్‌ గతంలో షారుక్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'అశోక'లో అతిథి పాత్ర చేశారు. ఆ పరిచయంతోనే ఇప్పుడూ దీనికి అంగీకరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

అజిత్, ఆర్య, రానా, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఆరంభం'. అత్యంతభారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇటీవల అక్కడ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం హక్కులు కొని 'ఆట ఆరంభం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు ఓమిక్స్ క్రియేషన్స్ అధినేత డా.శీనుబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుక్ను ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.

అజిత్, ఆర్య నటన, నయనతార, తాప్సీ గ్లామర్, విష్ణువర్థన్ టేకింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. ఈ నెల మూడో వారంలో ఆడియోను, నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్, నిర్మాత: డా.శ్రీనుబాబు జి., దర్శకత్వం: విష్ణువర్థన్.

English summary
Ajith's Aarambam, release for diwali is a box office hit, directed by vishnuvardhan. Vishnuvardhan has planned to remake aarambam in hindi with a belief that it would hit the box office in bollywood too. Shahrukh khan has seen the aarambam movie and liked it very much. so he asked vishnuvardhan that we shall remake the movie in bollywood. Its also said that shahrukh will be doing ajith's character and ajith will be doing telugu actor rana's character in the movie. But ajith has not confirmed the news yet. Its known that ajith has already did a role in samrat asoka, srk movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu