»   » బాలకృష్ణ 'సింహా'కు మరో పెద్ద రికార్డు

బాలకృష్ణ 'సింహా'కు మరో పెద్ద రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన "సింహా" ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం వైజాగ్ లోని గోపాలపురం మౌర్య ధియోటర్ లో మరో కొత్త రికార్డుని నెలకొల్పింది. అక్కడ ఈ చిత్రం రెండు వందల రోజులు కంటిన్యూగా రోజుకు నాలుగు ఆటలు చొప్పున ఆడింది. దాంతో వేడుకలు ఈ ధియోటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, ఉత్తరాంధ్ర నందమూరి అభిమానులు, స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ బాబు హాజరయ్యారు. సభా వేదికపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలయ్య డూప్ సింహా చిత్రంలోని డైలాగులు, డ్యాన్స్‌ లకు బాలయ్య అభిమానులు కేరింతలు కొట్టారు.

ధియోటర్ మేనేజ్మెంట్ తెలిపిన దాని ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకూ పదిహేడు లక్షల, ఎనభై వేలు కలెక్టు చేసింది. ఇక ఈ చిత్రం 2010లో విడుదలైన తెలుగు స్ట్రైయిట్ చిత్రాలలో రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu