»   » ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ విడుదల తేదీ ఖరారు

‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమంత్ హీరోగా చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో చెర్రీ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై పూదోట సుధీర్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా 'ఏమో.. గుర్రం ఎగరావచ్చు.'. పింకీ సావిక నాయిక. ఈ సినిమా ఆడియో విడుదల వేడుక 11.12.13న బ్యాంకాక్‌లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం విడుదల తేదీ ప్రకటించారు. ఈ నెల(జనవరి)24న విడుదల చేయాలని నిర్ణయించారు.

జీవితంలో ప్రతి విషయం పద్ధతిగా జరగాలనుకునే అమ్మాయికి, ప్రణాళికలు అవసరం లేదనుకునే అబ్బాయికి మధ్య జరిగే కథే ఈ సినిమా. ఈ కథను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సోదరుడు కాంచి అందించగా, మరో సోదరుడు కీరవాణి ఈ సినిమా సంగీతం అందించారు. ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి.

Emo Gurram Egaravachu

సుమంత్ మాట్లాడుతూ "కీరవాణిగారితో పనిచేయడం ఇదే తొలిసారి. సూపర్బ్ ఆడియో కుదిరింది. ఈ సినిమా కోసం థాయ్ హీరోయిన్‌ని ఎందుకు సెలక్ట్ చేశారని చాలా మంది అడిగారు. ఈ సినిమా చూస్తే వారందరికీ అర్థమవుతుంది. అచ్చం తెలుగమ్మాయిలా ఉంది పింకీ సావిక'' అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ "ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. బ్యాంకాక్ కథానాయిక పింకీ సావిక ఫ్యాన్స్ క్లబ్ మా చిత్ర యూనిట్‌కు డిన్నర్ ఇచ్చి భారీగా సత్కరించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు.

English summary

 The release date of hero Sumanth’s ‘Emo Gurram Egaravachu’ has been confirmed. The movie will now hit the screens on January 24th and this has been officially confirmed by production sources.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu