»   » తెలుగు డైలాగుతో సల్మాన్ ఖాన్ ట్రైలర్ (వీడియో)

తెలుగు డైలాగుతో సల్మాన్ ఖాన్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హిందీ సూపర్ స్టార్ తెలుగులో డైలాగు చెప్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన,ఆశ్చర్యకరమైన పనని సల్మాన్ ఖాన్ చేసారు. తన తాజా చిత్రం కిక్ రీమేక్ ... ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేసారు. ఆ ట్రైలర్ లో ...నేను అర్జెంటుగా టాయిలెట్ కి వెళ్లాలి అంటూ తెలుగులో డైలాగు చెప్పి, అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు. ఆ డైలాగు మీరే వినండి... ఇదిగో వీడియో...

రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చి విజయం సాధించిన 'కిక్‌' చిత్రాన్ని హిందీలో పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ దబాంగ్ లో హీరోయిన్ గా చేసిన సోనాక్షి సిన్హా ఆయనకు జోడీగా చేయనుంది. ఈ చిత్రం ట్రైలర్ ని రీసెంట్ గా విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయ సాధిస్తుందనే టాక్ మొదలైంది.

The trailer of Salman Khan's Eid release 'Kick'

తొలిసారి దర్శకత్వం వహించిన నిర్మాత షాజిద్ నడియాడ్ వాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెప్పబోనని సల్మాన్ అన్నారు. చెబితే ఫ్యాన్స్ ఎక్కువగా ఊహించుకుంటారని, అందుకే తెరపై చూడాలని అన్నారు. తెలుగులో విజయం సాధించిన కిక్ కి ఇది రీమేక్. సల్మాన్ సరసన జాక్వెలెన్ ఫెర్నాండెజ్ నటించారు. జాక్వెలెన్ ను అప్పటి బాలీవుడ్ తార జీనత్ అమన్ తో సల్మాన్ పోల్చారు. జీనత్ స్ధాయి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుదని చెప్పారు.

ఈ చిత్రానికి సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత ఛేతన్ భగత్ స్రీన్ ప్లే రాయించటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఛేతన్ తన ట్వీట్ ద్వారా తెలియచేసారు. గతంలో ఛేతన్ భగత్ రాసిన 'వన్ నైట్ అట్ కాల్ సెంటర్'ని సల్మాన్ హీరో గా తెరకెక్కించారు. ఆ అనుభంధంతో మరోసారి సల్మాన్..పిలిచి మరీ ఈ వర్క్ అప్పగించారు.

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/u-j1nx_HY5o" frameborder="0" allowfullscreen></iframe></center>

ఇక ఈ విషయమే ఛేతన్ భగత్ ట్వీట్ లో... ' ఈ విషయం మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ - సాజిద్ నదియావాలా కాంబినేషన్లో రానున 'కిక్' సినిమాకి స్క్రీన్ ప్లే రాయబోతున్నాను. సాజిద్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో ఇంకా టఫ్ గా స్క్రీన్ ప్లే కావాలని నన్ను అడిగారు. అందుకోసం నేను ముందు 'కిక్' ఒరిజినల్ అయిన తెలుగు వెర్షన్ చూడబోతున్నాను. భారీ అంచనాలున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు కూడా చేస్తాను. నాకు మీ అందరి ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు.

'కిక్' సల్మాన్‌ఖాన్ హీరోగా సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో అదే పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. హిందీ నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారు. అలాగే కిక్ తమిళ వెర్షన్ ని ఎడిటర్ మోహన్ కుమారుడు జయం రవితో నిర్మించారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా నమోదయింది. తమన్నా అందచందాలు కూడా సినిమాని నిలబెట్టలేకపోయాయి. అయితే ఈ కిక్ రీమేక్ పై సల్మాన్ ఖాన్ బాగా నమ్మకంగా ఉన్నారు. తాను చేసిన 'పోకిరి', 'రెడీ' రీమేక్స్ హిట్టవటంతో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుదని నమ్ముతున్నాడు.

English summary
Releasing on Eid, Salman Khan's 'Kick' sees him as a guy with many faces, but the most important him being 'The Devil' in the film. Starring alongside Salman is actor Randeep Hooda who made his presence felt in Imtiaz Ali's 'Highway' in the recent past. Celebrated actor Nawazuddin Siddiqui also will be seen in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu