»   » ఈ వారం రిలీజులు పొజీషన్(ట్రేడ్ టాక్)

ఈ వారం రిలీజులు పొజీషన్(ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ శుక్రవారం కోడిపుంజు,అమాయకుడు చిత్రాలు విడుదలయ్యాయి.ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.దానికి తగినట్లుగా నైజాం ప్రాంతంలో రిలీజ్ రోజున బంద్ చేయటం కూడా సినిమా కు ఓపినింగ్స్ రాకుండా దెబ్బకొట్టింది. బి.వి.వి చౌదరి దర్సకత్వంలో రూపొందిన కోడిపుంజు చిత్రంలో తనీష్ హీరోగా చేసారు.రోజా మరో కీలకపాత్రలో చేసింది.ఇక అమాయకుడు చిత్రంలో కృష్ణుడు హీరోగా చేసాడు.కధాబలమూ లేక స్టార్స్ లేక ఈ చిత్రాలు రెండూ చతికిలపడ్డాయి.వీటికి తోడు నమిత ప్రధాన పాత్రలో చేసిన పచ్చి మిరపకాయ చిత్రం,తిరుగుబోతు చిత్రాలు డబ్బింగై విడులయ్యాయి. వీటికి ప్రమోషనల్ ఛార్జీలు కూడా రాకపోవటం డిస్ట్రిబ్యూటర్స్ ని,ఎగ్జిబీటర్స్ ని బాగా నిరాశపరిచింది.ముఖ్యంగా కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చుకున్న కోడిపుంజు చిత్రం మరీ పురాతన కాలం నాటి టేకింగ్ తో నీరసంగా నడిచింది.

English summary
Two prime releases of the week are ‘kodi punju’ and ‘Amayakudu.Unanimously talk was disappointing declaring the two as disasters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu