»   » ఈ వారం సినిమాల భాగోతం!

ఈ వారం సినిమాల భాగోతం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈనెలలో ప్రేక్షకుల తీర్పును కోరుతూ మూడు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. అవి నాగార్జున నటించిన 'కేడి", అంతా కొత్తవాళ్లతో రూపొందించిన చిత్రం 'తేజం", నూతన పరిచయస్తులు గా రానా, రీచ గంగోపాధ్యాయ, ప్రియ ఆనంద్. నాగార్జున కెరీర్ లో గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇలా జరగడం ఇదే మొదటి సారి. మొత్తానికి డిసెంబర్ లో, ఆ తర్వాత సంక్రాంతికి వస్తుందనుకున్న 'కేడి" ఎట్టకేలకు శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కొత్త దర్శకుడు కిరణ్ ను పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. దర్శకుడు కిరణ్ వైవిధ్యమైన స్ర్కీన్ ఫ్లేతో స్టైలిష్ గా సినిమాను తెరకెక్కించాడు. రొటీన్ కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు, వైవిద్యం కోరుకునే వారికి ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది. సినిమాను నాగార్జున ఆద్యంతం వన్ మ్యాన్ షోలా నడిపాడు. ఇక కొత్తవాళ్లతో రూపొందిన 'తేజం" యువలకులకు ఏ మాత్రం ఉత్తేజాన్ని ఇవ్వకపోయింది. ముఖ్యంగా ఈ చిత్రం విషయానికొస్తే సరైన స్ర్కీన్ ప్లే లేకపోవడం స్పష్టంగా కనిపించింది. దర్శకుడి అనుభవ రాహిత్యంతో ఏ సన్నివేశం కూడా పండలేదు. ఇక అంతక ముందు వారం చిత్రాలైన 'బిందాస్" నీరసంగా సాగుతుండగా, కార్తీ నంటించిన 'యుగానికి ఒక్కడు" మంచి కలెక్షన్లతో థియేటర్లు పెంచుకుంది.

తెలుగు సినిమా ఉజ్వల భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచిన వర్తమాన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి మంచి సాఫ్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన మరో మంచి ప్రయత్నం లీడర్. ప్రఖ్యాత ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా డాక్టర్ రామానాయుడు మనవడు, సురేష్ బాబు కుమారుడు రాణా కథానాయకుడిగా పరిచయం చేశారు. ఈ వారం రిలీజైన శేఖర్ కమ్ముల 'లీడర్" ఆవరేంజ్ టాక్ ను తెచ్చుకొంటోంది. ఇప్పుడే సినిమా ఫలితాన్ని తేల్చలేం కానీ మరో వారం ఆగాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu