twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ENEMY Day 1 collections.. ఊహించని విధంగా ఎనిమీ కలెక్షన్లు..మొదటి రోజు ఎంతంటే?

    |

    యాక్షన్ హీరో విశాల్, ఆర్య కాంబినేష‌న్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌ 'ఎనిమీ'. భారీ అంచనాలతో వచ్చిన 'ఎనిమీ' సినిమా తమిళ భాషతో పాటు తెలుగులో కూడా దీపావళి సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సినిమా మీద అంచనాలు పెంచేయడంతో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమా ఊహించిన మేర కలెక్షన్లు అందుకుందా లేదా అనేది మొదటి రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం..

     మంచి అంచనాలతో

    మంచి అంచనాలతో

    'వాడు వీడు' తర్వాత విశాల్, ఆర్య లు కలిసి నటించిన మరో చిత్రం 'ఎనిమీ'. వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడం వల్ల ఇద్దరి అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. నిజమైన ఎనిమీఎవరంటే అన్నీ తెలిసిన స్నేహితుడే లాంటి డైలాగ్స్ 'ఎనిమీ'పై ఆసక్తి పెంచాయి. దీపావళి సందర్భంగా రజినీకాంత్ 'పెద్దన్న'తో పోటీపడుతూ తెలుగు, తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా? అనేది పరిశీలిద్దాం.

    యావరేజ్ టాక్ రావడంతో

    యావరేజ్ టాక్ రావడంతో

    హీరో విశాల్, ఆర్య కలిసి నటించిన సినిమా 'ఎనిమీ'. నోటా సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. మినీ స్టూడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో పెద్దగా కలెక్షన్లు రావనుకున్నారు.

     నేపథ్యం ఇలా

    నేపథ్యం ఇలా

    సింగపూర్‌లో లిటిల్‌ ఇండియా అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్ళు ఎలా కలుస్తారు? అన్నది ఈ సినిమా కథాంశం. అయితే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ సాధించింది.

     ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అంటే

    ఈ సినిమా రిలీజ్ కు ముందు తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. విశాల్ మార్కెట్ తో పోలిస్తే కొంచెం తక్కువే అయినా ఇప్పుడున్న పరిస్థితిలో మంచి బిజినెస్ అనే చెప్పాలి. దీంతో ఈ సినిమా ఐదు కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే మరి ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏ మేరకు వసూళ్లు సాధించింది అనే సంగతి పరిశీలిద్దాం.

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా

    హీరో విశాల్, ఆర్య కలిసి నటించిన 'ఎనిమీ' సినిమా నిజాంలో 38 లక్షలు, సీడెడ్ 16 లక్షలు, ఉత్తరాంధ్ర 12 లక్షలు, ఈస్ట్ గోదావరి 9 లక్షలు, వెస్ట్ గోదావరి 6 లక్షలు, గుంటూరు 12 లక్షలు, కృష్ణా జిల్లా 5.4లక్షలు, నెల్లూరు 5 లక్షలు అలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలతో పోల్చుకుంటే కోటి రూపాయల రెండు లక్షల షేర్ సాధించగా, కోటి అరవై లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. పెద్దన్న సినిమా లైన్ లో ఉండడంతో ఈ సినిమాకు కలెక్షన్లు రావనుకుంటే ఊహించిన దాని కంటే ఎక్కువ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    Recommended Video

    105 Minutes Movie Official Teaser || Hansika Motwani
    మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా

    మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా

    ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే కోటి రూపాయల రెండు లక్షల షేర్ సాధించగా ఐదు కోట్ల టార్గెట్ కు ఇంకా 3.98 కోట్ల దూరంతో ఉంది. ఇక తమిళనాడులో ఈ సినిమా 2.55 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే మిగతా భారతదేశంలో 1.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సేస్ లో సినిమా 2.1 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా 3.8 కోట్ల షేర్ సాధించింది.

    English summary
    vishal arya starrer ENEMY Day 1 collections report is here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X