CelebsbredcrumbNamrata Shirodkar
  నమ్రతా శిరోద్కర్

  నమ్రతా శిరోద్కర్

  Actress
  Born : 22 Jan 1972
  నమ్రతా శిరోద్కర్  ఒక భారతీయ సినీ నటి. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట మోడల్ గా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు గౌతం... ReadMore
  Famous For
  నమ్రతా శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట మోడల్ గా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు గౌతం కృష్ణ మరియు పాప సితార. ఈమె తెలుగులొ చిరంజీవి సరసన అంజి సినిమాలొ నటించింది మరియు వంశీ సినిమాలొ మహేష్ సరసన నటించింది. పెళ్ళి తరువాత సినిమాలకి స్వస్తి చెప్పింది.

  Read More
  • 1
   సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలివుడ్ లో కి అడుగుపెట్టాడు మన మహేష్ బాబు అదే సమయంలో బాలీవుడ్ లో నమ్రతా శిరోద్కర్ కూడ తన కెరీర్ ప్రారంభించింది.
  • 2
   వయసులో ప్రిన్స్ మహేష్ బాబు కంటే నమ్రతా శిరోద్కర్ నాలుగేళ్లు పెద్దది. ఈ జంట కుటుంబ సంప్రదాయాలపైనా చాలా గౌరవం కలవారు.
  • 3
   ఆ తర్వాత 1998లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నమ్రత వెండి తెరపై రాణించకపోయినా... రీల్ లైఫ్ లోనూ.. రియల్ లైఫ్ లోనూ ఓ వెలుగు వెలిగింది. మంచి పాపులారిటీని మాత్రం సాధించింది.
  • 4
   నమ్రతా శిరోద్కర్ మరియు మహేష్ బాబు మొదటిసారి ‘వంశీ‘ చిత్రం ద్వారా కలిశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్‘ అన్న మాటను వీరిద్దరూ నిజం చేశారు. అలా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.
  • 5
   ఇద్దరు చాలా సింపుల్ గా ఉండే వీరి వ్యక్తిత్వమే వీరిని ప్రేమలో పడేసింది. ఆ సినిమా తర్వాత వీరి ప్రేమ సాఫీగా సాగింది. అయితే అదే సమయంలో వాారి ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
  • 6
   కుటుంబానికి ఎంతగానో విలువ ఇచ్చే మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు వివరించారు. వారి అనుమతి తర్వాత బయటి ప్రపంచానికి వారి ప్రేమ గురించి తెలియజేశారు.
  • 7
   అలా 2005లో తెలుగు వారి సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఈ పెళ్లికి వారి ఇద్దరి కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహం ముంబైలోని మారియట్ హోటల్లో 2005లో ఫిబ్రవరి 10వ తేదీన జరిగింది.
  • 8
   వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వారి పెళ్లి పనులన్నీ నమ్రత కుటుంబసభ్యులే దగ్గరుండి నిర్వహించారు. పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు సినిమా షూటింగులో పాల్గొన్నారు.
  • 9
   తన పెళ్లి తర్వాత తాను నటించడం మహేష్ బాబుకు ఇష్టం లేదని, పెళ్లికి ముందే నమ్రతా తన షూటింగులన్నీ పూర్తి చేసుకుందట. అది ఎంతలా అంటే పెళ్లికి వారం రోజుల ముందు వరకూ ఆమె షూటింగులో పాల్గొంటూనే ఉండేదట.
  • 10
   వీరి పెళ్లి అయిన తర్వాత సంవత్సరంలోనే గౌతమ్ పుట్టాడు. అయితే ప్రేమ పెళ్లి అంటే నిరంతరం అర్థం చేసుకుంటూ బంధాన్ని నిలబెట్టుకోవడమే అని ఈ జంట నిరూపించింది.
  • 11
   అయితే ఈ జంట బంధంపై 2008లో తెగ రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయారని... అందుకు తగ్గట్టే అప్పట్లో నమ్రత తన కుమారుడితో కలిసి ముంబైకి వెళ్లిపోవడంతో అందరూ అలాగే అనుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ వారిని కఠినమైన పరిస్థితుల్లోనూ కలిసేటట్టు చేశాయి.
  • 12
   ఆ రూమర్స్ గురించి నమ్రత ఓ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు.‘‘పెళ్లి తర్వాత మూడో ఏడాదిలో మా ఇద్దరికీ పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. అప్పటికీ మాహేష్ బాబుకు సినిమాలు లేవు. మా అమ్మ, నాన్న చనిపోయారు. తన బామ్మ కూడా మరణించారు. మహేష్ కూడా ఎలాంటి సినిమా ఒప్పుకోవాలో.. తనకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాడు. అప్పుడు మా ఇద్దరికీ కొంత గొడవలు జరిగాయి. అయితే ఇవన్నీ మమల్ని మరింత కలిపేందుకు పని చేశాయి.
  • 13
   దీని వల్లే మా ఇద్దరి మరింత బలంగా తయారైంది. ఇప్పటికీ మా ఇద్దరి బంధానికి సంబంధించిన పునాదులు చాలా బలంగా ఉన్నాయంటే అందుకు గొడవలు కూడా ఒక కారణమే‘‘ అని నమ్రత చెప్పారు.
  • 14
   వీరిద్దరూ గొడవల తిరిగి కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత కొన్నేళ్లకు అంటే 2012లో సితారకు జన్మనిచ్చింది నమ్రత. మహేష్ తన పిల్లలు, భార్యతో ప్రేమతో ఉండటమే కాదు. కాస్త టైమ్ దొరికితే చాలు. టూర్లకు వెళ్లడానికి తెగ ఆసక్తి చూపుతారట.
  నమ్రతా శిరోద్కర్ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X