»   » అల్లు అర్జున్‌-స్నేహారెడ్డిల ప్రేమ మొదలైంది అప్పుడే...

అల్లు అర్జున్‌-స్నేహారెడ్డిల ప్రేమ మొదలైంది అప్పుడే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో అల్లు అర్జున్‌-స్నేహా రెడ్డిల ప్రణయం ..పరిణయం గా మారబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందన్న విషయంపై ఆసక్తి అంతటా కనపడుతోంది. వీరి పరిచయం అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో చేసిన క్రిష్ చిత్రం 'వేదం" షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జరిగిందని వినపడుతోంది. అయితే మరికొందరు స్నేహారెడ్డి..వీరి పొరుగింటి అమ్మాయిని దాదాపు మూడు సంవత్సరాలనుండీ వీరి మధ్య ప్రేమ కథ నడుస్తోందని అంటున్నారు. స్నేహారెడ్డి తండ్రి కె. చంద్రశేఖర్‌రెడ్డి హైద్రాబాద్‌లోని 'ఎస్‌.సి.ఇన్‌.ఐ. యన్‌.టి" ఇంజనీరింగ్‌ కాలేజీ నిర్వహిస్తుండడమే కాక పలు ఇతర వ్యాపారాలు కూడా నడుపుతున్నారని సమాచారం. హైద్రాబాద్‌, ఇబ్రహీంపట్నంలోని తమ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన స్నేహారెడ్డి అనంతరం అమెరికాలో ఎం.ఎస్‌ చేసారు. ప్రస్తుతం తమ ఇంజనీరింగ్‌ కాలేజీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ కాలేజీ నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక పదిహేను సంవత్సరాల క్రితం స్నేహారెడ్డిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. అయితే హైదరాబాదులో స్నేహారెడ్డి తండ్రి కె. చంద్రశేఖర్‌రెడ్డి అప్పట్లో భూములు కొనుగోలు చేయడం, ఆ తర్వాత రియల్ భూం రావడంతో కోట్లకు పడగలెత్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu