»   » ఎట్టకేలకూ శోభన పెళ్లి.. అఫైర్ బ్రేక్.. పెళ్లి కొడుకు ఎవరంటే..

ఎట్టకేలకూ శోభన పెళ్లి.. అఫైర్ బ్రేక్.. పెళ్లి కొడుకు ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటి, ప్రముఖ నృత్యకారిణి శోభన తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర రంగాలకు సుపరిచితులు. సినీ పరిశ్రమలో చాలా సీనియర్ నటి. ఆమె వయస్సు దాదాపు 47 సంవత్సరాలు. అయితే ఆ వివాహానికి దూరంగా ఉండటం గత కొద్దికాలంగా మిస్టరీగా మారింది. తన పెళ్లి గురించి మీడియా తెలుసుకొనేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించడానికి నిరాకరించేది. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తున్నది. తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు మీడియాను అలర్ట్ చేశాయి.

శోభన కాబోయే భర్త గురించి మీడియా ఆరా

శోభన కాబోయే భర్త గురించి మీడియా ఆరా

శోభన చేసుకోబోయే వ్యక్తి గురించి మీడియా ఆరా తీస్తున్నది. శోభన వివాహం చేసుకొనేది సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తినా? లేక ఇతర రంగాలకు సంబంధింన వ్యక్తినా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అయితే ఆమె పెళ్లికి సంబంధించిన వివరాలు చాలా గొప్యంగా ఉంచడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడమే..

ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడమే..

శోభన పెళ్లి చాలా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఓ మలయాళ నటుడితో ఆమెకు ఉన్న ప్రేమ వ్యవహారమే అనేది అప్పట్లో బలంగా వినిపించింది. వారి ప్రేమ బంధం పెళ్లి పీటల వరకు వెళ్తుందని అందరూ భావించారు. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా అనూహ్యంగా వారిద్దరూ విడిపోయారట. దాంతో మనస్తాపానికి గురైన శోభన వివాహానికి దూరంగా ఉన్నారనేది ఓ రూమర్.

ఓ బాలికను దత్తత

ఓ బాలికను దత్తత

ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత ఓ అమ్మాయిని 2001లో దత్తత తీసుకొన్నారు. తాను దత్తత తీసుకొన్న అమ్మాయికి అనంత నారాయణి అనే పేరు పెట్టారు. ఆ బాలిక సంరక్షణ బాధ్యతలను ఎత్తుకొని తన తనలోని బాధను దూరంగా పెట్టుకొన్నారు. నృత్య రంగానికి సేవలందిస్తూ కాలం గడుపుతున్నారు. ఇక శోభన పెళ్లి చేసుకోరని అందరూ అనుకొంటున్నగా మళ్లీ ఆమె పెళ్లి వార్తలు షాకింగ్‌ ఇచ్చాయి.

సినీ పరిశ్రమలో మంచి బ్యాక్ గ్రౌండ్

సినీ పరిశ్రమలో మంచి బ్యాక్ గ్రౌండ్

సినీ పరిశ్రమలో శోభనకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది. అలనాటి నటీమణులు లలిత, పద్మిని, రాగిణి ఈమెకు బంధువులు. నటుడు వినీత్ కూడా దగ్గరి బంధువే అవుతారు. ఆమె నటించిన మనిచిత్రతాజు (తెలుగులో చంద్రముఖి) చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఫాజిల్, ప్రియదర్శన్, ఆదూర్, మణిరత్నం దర్శకులతో కలిసి పనిచేసింది. సినీ, నృత్య రంగాలకు సేవలందిస్తున్నందుకు గాను శోభనను పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.

 వివాహం చేసుకోవడానికి అంగీకరించిన..

వివాహం చేసుకోవడానికి అంగీకరించిన..

ప్రేమలో విఫలమైన శోభన ఎట్టకేలకూ వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆమెను పెళ్లికి ఒప్పించడంలో సఫలమయ్యారట. దాంతో చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకొనేందుకు అంగీకరించినట్టు తాజా వార్త వెలుగు చూసింది. అయితే ఈ వార్తను శోభన గానీ, ఆమె కుటుంబ సభ్యులుగానీ అధికారికంగా ప్రకటించలేదు.

English summary
There was a lot of speculations about the true reason behind Shobhan single status; but the actress has never made any comments over the rumours. Recently a leading Malayalam daily published some reports over Shobana's single status.The daily reports that Shobana was in a serious relationship with a leading actor of Mollywood; but later broke up with him due to unknown reasons. The actor married a girl of his family's choice and is leading a perfect married life now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X