»   »  'బాహుబలి' లో అడవి శేషు పాత్ర ఏమిటంటే...

'బాహుబలి' లో అడవి శేషు పాత్ర ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో అడవి శేషు కనిపించనున్న సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం అడవి శేషు పాత్ర... రానా కు కొడుకు పాత్ర. ఈ పాత్ర 18 నిముషాలు పాటు ఉంటుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రంలో దగ్గుబాటి రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరవీ నెగిటివ్ రోల్సే. అలాగే గారాబంతో చెడిపోయిన కొడుకు పాత్ర అడవి శేషుది అని తెలుస్తోంది. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.


ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Adivi Sesh’s role in Baahubali revealed

మొదటి పార్ట్ దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కించాడు రాజమౌళి. ఇ


ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఈ పదవ తేదిన వస్తోంది.


రాజమౌళి మాట్లాడతూ తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు.

English summary
Rana plays the role of a father in the period film. His son in the film is none other than Adivi Sesh, who shot to fame as a spoilt brat in the Pawan Kalyan-starrer 'Panjaa'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu