టక్ జగదీష్ దెబ్బకు ఆ సినిమాలు కూడా ఓటీటీ బాటలోనే.. మరో దారి లేదు!

కరోనా వైరస్ దెబ్బకు దాదాపు రెండేళ్ల సినిమా బిజినెస్ పై దెబ్బ పడింది అనే చెప్పాలి. గత ఏడాది రావాల్సిన చాలా సినిమాలు ఇప్పటి వరకు కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వడ్డీలకు తెచ్చి సినిమాలు నిర్మించిన వారు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరైతే చేసేదేమీ లేక డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఒక విధంగా ఆ తరహాలోనే విడుదల చేయడం బెటర్ అని కొందరు నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి ఓటీటీ సంస్థలు ఎంతో కొంత లాభాలు వచ్చేలా ఆఫర్స్ తో నష్టాల భారిన పడకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం నాని కొత్త సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీలో రిలీజ్ అయితే చాలా సినిమాలు అలానే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని సుధీర్ బాబు హీరోగా నటించిన మీడియం బడ్జెట్ మల్టీస్టారర్ v సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా నానీ హీరోగా నటించిన టాక్ జగదీష్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కావచ్చని తెలుస్తోంది. అసలైతే ఈ సినిమా గత సంక్రాంతికే విడుదల కావాల్సింది. రిస్క్ చేయడం ఇష్టం లేక నిర్మాతలు ఇప్పటి వరకు ఎంతో ఓపిక పట్టారు. సెకండ్ వేవ్ అనంతరం విడుదల చేయాలని అనుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల విషయంలో కొత్త రూల్స్ ను అమలు చేయడంతో మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. టికెట్ ధరలు బాగా తగ్గడం వల్ల ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండగా అమెజాన్ ప్రైమ్ లాభదాయకమైన ఆఫర్ ను ప్రకటించింది. ఒక విధంగా బడ్జెట్ కంటే కూడా నిర్మాతలకు ఎంతో కొంత లాభం వచ్చేలాగానే ఆఫర్ చేసినట్లు సమాచారం.

After tuck jagadish ott release another films also coming same way

ఒకవేళ టక్ జగదీష్ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైతే అదేబాటలో మరికొన్ని సినిమాలు కూడా విడుదల కావచ్చు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన నాగచైతన్య సాయి పల్లవిల 'లవ్ స్టోరీ' కూడా పోటీలోకి రావచ్చని టాక్ వస్తోంది. సాయి పల్లవి రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరెక్కుతున్న విరాటపర్వం సినిమా కూడా అదే తరహాలో రావచ్చని తెలుస్తోంది. ఇటీవల నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమాకు లాభాలు రావడంతో విరాటపర్వం సినిమాని కూడా మంచి రేటుకి అమ్మేయాలని చూస్తున్నారట.

ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా గత ఏడాది నుంచి థియేటర్స్ లోకి రావాలని ఎదురుచూస్తోంది. గతంలో రెండు సార్లు విడుదల తేదీని ఫిక్స్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అనేక రకాల ఓటీటీ సంస్థల నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు ఆ ఆఫర్స్ ను రిజెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఓటీటీ రిలీజ్ పై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X