»   » ఆ విషయం గుర్తుచేస్తే భూమిక రేటు తగ్గుతుంది

ఆ విషయం గుర్తుచేస్తే భూమిక రేటు తగ్గుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖుషి, వాసు, మిస్సమ్మ వంటి చిత్రాలతో ఒక్క వెలుగు వెలిగిన భూమిక కోస్టార్స్ కన్నా ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేసేది. అయితే ఈ మధ్య ఆమెను ఎప్రోచ్ అవుతున్న నిర్మాతలు ఆమె వయస్సును, పెళ్ళి అయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ రెమ్యునేషన్ బేరమాడుతున్నారు. ఈ విషయాలు ఎత్తగానే ఆమె సైలెంట్ అయిపోయి వారు చెప్పిన రేటుకు ఒప్పుకుంటోందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అందులోనూ అరకొరగా అప్పుడప్పుడూ వచ్చే వేషాలు సైతం రెమ్యునేషన్ పేరు చెప్పి తగ్గిపోవటం కూడా ఆమె ఇష్టపడటం లేదు. దాంతో రెగ్యులర్ గా ఆమె తీసుకునే నలభై లక్షలు రేటు ని కూడా బాగా తగ్గించేసి నిర్మాతలు కోసం తలుపులు తెరిచిందని చెప్తున్నారు. డిమాండ్ కోసం డిస్కౌంట్ ఇస్తోందని ఆ లెక్కలో వచ్చిన చిత్రమే తాజాగా ఆమె ప్రకాష్ రాజ్ తో చేస్తున్న కలెక్టర్ గారి భార్య చిత్రం అంటున్నారు. ఇక ఆమె నటించిన భ్రమరం మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా మళయాళంలో వరస ఆఫర్స్ రాకపోవటం కూడా ఆమెను ఆలోచనలో పడేసి ఈ రెమ్యునేషన్ తగ్గింపు నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X