»   » 'రోబో' శంకర్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సినిమా

'రోబో' శంకర్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదేంటి పెద్ద హీరోలను డైరక్ట్ చేస్తూ భారీ బడ్జెట్ సినిమాలు తీసే శంకర్..అల్లరి నరేష్ తో సినిమా చేయటమేమిటని ఆశ్చర్యపోకండి. అల్లరి నరేష్ ని త్రిఇడియట్స్ రీమేక్ కు శంకర్ ఎంపికచేసారని సమాచారం. అయితే రెండవ ఇడియట్టా, మూడవ ఇడియట్టా అనేది తేలాల్సి ఉంది. అలాగే ఆ చిత్రంలో అమీర్ ఖాన్ చేసిన పాత్రను తమిళంలో విజయ్, తెలుగులో మహేష్ చేస్తారని మొదట అన్నారు. అయితే తర్వాత అబ్బే..రెండు భాషల్లోనూ విజయ్ చేస్తాడని టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా మహేష్ బాబు లేనిదే తెలుగులో త్రి ఇడియట్స్ రీమేక్ అనవరసరం అని శంకర్ తన శ్రేయాభిలాషుల వద్ద అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఇలియానాను...ఈ రీమేక్ లో కరీనా కపూర్ పాత్రకు తీసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం స్క్రిప్టుని కూడా సౌత్ లాంగ్వేజ్ లకు తగినట్లుగా మారుస్తున్నారని, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తున్నారని తెలుస్తోంది. వీటికి తోడు శంకర్ ...తనకు కేవలం 45 రోజులు డేట్స్ ఇస్తే చాలు సినిమా పూర్తి చేస్తానంటూ మహేష్ బాబుకి ఆఫర్ ఇచ్చారు. ఇవన్నీ ఎలా ఉన్నా అల్లరి నరేష్ ...మాత్రం శంకర్ దర్సకత్వంలో చేయటాన్ని మాత్రం ఇప్పటికీ ఆశ్చర్యంతో నమ్మలేకపోతున్నారుట.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu