»   » సారీ..! అల్లు‌అర్జున్ ఫ్యాన్స్.., మీకో బ్యాడ్‌న్యూస్ : డీజే విడుదల వాయిదా

సారీ..! అల్లు‌అర్జున్ ఫ్యాన్స్.., మీకో బ్యాడ్‌న్యూస్ : డీజే విడుదల వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్‌ సమ్మర్‌ సీజన్‌ బాగా కలిసివస్తుంది. గతంలో సమ్మర్‌లో రిలీజైన ఆయన సినిమాలు కథానుగుణంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగా హిట్‌ అయ్యాయి. దీంతో తన తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్‌'ను కూడా ఈ వేసవి కాలంలోనే విడుదల చేసేందుకు ప్లాన్‌ను వేసుకున్నాడు బన్నీ. కానీ ఇప్పుడా ప్లాన్ తిరగబడేటట్టుంది. సినిమా ఇంకో రెండు నెలలు వెనక్కి జరిగే అవకాశం ఉంది.

భారీ హైప్

భారీ హైప్

బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేయగా.. చిత్రయూనిట్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది.


సమ్మర్ రిలీజ్‌

సమ్మర్ రిలీజ్‌

ఇంకా 10 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండడంతో సమ్మర్ రిలీజ్‌గా మే 19న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్ణయించాడు. కానీ, ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడబోతోందట. అదీ రోజులు కాదు నెలలపాటు. జూన్ 2 న వచ్చే అవకాశాలున్నాయంటున్నారు


మే 19న రిలీజ్ చేయనున్నట్టుగా

మే 19న రిలీజ్ చేయనున్నట్టుగా

షూటింగ్ సమయంలోనే ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సమ్మర్ బరిలో బన్నీకి మంచి రికార్డ్ ఉండటంతో డీజే బన్నీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ అభిమానులకు షాక్ ఇస్తూ డీజే సినిమాను రెండు నెలలపాటు వాయిదా వేశారన్న టాక్ వినిపించింది.


మహేష్ 23 సినిమా రిలీజ్

మహేష్ 23 సినిమా రిలీజ్

అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవటం, తరువాత మహేష్ 23 సినిమా రిలీజ్ ఉండటంతో రెండు నెలల పాటు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇదే కథ కొన్నాళ్ళ క్రితం మరోలా వినిపించింది అందులో నిజమెంతో తెలీదు కానీ అప్పటికైతే నమ్మబుల్ గానే అనిపించింది చాలామందికి. దాని ప్రకారం....


అల్లు అర్జునే

అల్లు అర్జునే

వాయిదా కారణం అల్లు అర్జునేనట. దుబాయ్‌లో ఇటీవల డీజే సినిమాకు సంబంధించిన పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా బన్నీకి స్కిన్ అలర్జీ వచ్చిందట. అందుకే ఇటీవల జరిగిన అల్లు రామలింగయ్య అవార్డు ఫంక్షన్‌కు మాస్క్‌తో వచ్చాడు బన్నీ. చిన్న అలర్జీయే కదా త్వరగానే తగ్గిపోతుందని భావించినా.. ఆ అలర్జీ కాస్త ఇంకా ఎక్కువైందట.


షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది

షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది

ముఖమంతా రాషెస్ వచ్చాయట. దీంతో డీజే షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ ఎఫెక్ట్ కాస్తా డీజే విడుదల తేదీపై పడింది. దీంతో అనుకున్న తేదీకి డీజే సినిమా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి కారణం ఎవరైనా సినిమా మాత్రం లేట్ అవుతుందన్నమాట...


English summary
As per the update, Duvvada Jagannadham is all set for June 2nd release and the film will miss the summer race informed a source from the film’s unit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu