Just In
- 1 min ago
రంగస్థలంలో సమంతను అందుకే తీసుకున్నా.. అసలు గుట్టు విప్పిన సుకుమార్
- 32 min ago
మళ్లీ జన్మంటూ ఉంటే మేయర్ కుక్కగా.. నా తల్లి కూడా అలాంటి ప్రేమను చూపించలేదు.. ఆర్జీవి ఎమోషనల్
- 57 min ago
కార్తీకేయ 2 కోసం బాలీవుడ్ నటుడు.. అదిరిపోయే అప్డేట్
- 1 hr ago
అవన్నీ తప్పుడు వార్తలే.. నా పర్మిషన్ లేకుండా.. సురేఖా వాణి స్వీట్ వార్నింగ్
Don't Miss!
- News
మోదీకి షాకిచ్చిన దీదీ -బీజేపీ లూటీ చేస్తోంది -ప్రధాని సభ వేళ ఎల్పీజీ ధరలపై బెంగాల్ సీఎం నిరసన
- Finance
8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.94 లక్షల కోట్లు జంప్
- Sports
అదే ఇంగ్లండ్ కొంపముంచింది.. దేశం కోసం ఆడేటప్పుడు దేనికైనా సిద్ధపడాలి: సునీల్ గవాస్కర్
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆలోచనలో పడిన సుకుమార్.. అల్లు అర్జున్ మూవీకి అదే టైటిల్ ఫిక్స్!
గత సినిమా 'నా పేరు సూర్య'తో నిరాశ పరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ లోటును భర్తీ చేస్తూ 'అల.. వైకుంఠపురములో' రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆయన అభిమానుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ప్రస్తుతం 'అల.. వైకుంఠపురములో' మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు బన్నీ.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తర్వలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం సుకుమార్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారని టాక్. గతంలో ఎన్నడూ ఏ హీరో చేయని డిఫెరెంట్ క్యారెక్టర్ బన్నీ కోసం రెడీ చేశారట సుక్కు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుండటం విశేషం.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై ఆసక్తికర వార్త బయటకొచ్చింది. 'శేషాచలం' అనే టైటిల్ ఫైనల్ చేసే దిశగా సుకుమార్ ఆలోచన చేస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. కథకు యాప్ట్ అయ్యే విధంగా ఈ టైటిల్ ఉంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బన్నీ కెరీర్‌లో 20వ సినిమాగా రానున్న ఈ మూవీలో అనసూయ కూడా కీలకపాత్ర పోషిస్తోందని సమాచారం. సుకుమార్ గత సినిమా 'రంగస్థలం'లో రంగమ్మత్తగా ఇరగదీసిన అనసూయను మళ్ళీ ఈ సినిమా కోసం తీసుకున్నారట ఈ క్రియేటివ్ డైరెక్టర్. మరికొద్ది రోజుల్లోనే బన్నీ- సుకుమార్ కాంబో విశేషాలు అఫీషియల్‌గా ప్రకటించనున్నారని తెలిసింది.