»   » అల్లు అర్జున్ వరుడు టాక్ లీక్ అయ్యిందా?

అల్లు అర్జున్ వరుడు టాక్ లీక్ అయ్యిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు (బుధవారం) రిలీజవుతున్న అల్లు అర్జున్ తాజా చిత్రం వరుడు టాక్ లీకయ్యిందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వారు చెప్పేదాని ప్రకారం వరుడు ఫస్ట్ హాఫ్ నలభై నిముషాలు ఎక్సలెంట్ గా తీసారు. సెకెండాఫ్ కొద్దిగా స్లో అయి క్లైమాక్స్ కి వచ్చేసరికి పుంజుకుంటుందని చెప్తున్నారు. దాంతో సినిమా హిట్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్తుందని చెప్తున్నారు. చిత్రం కూడా భారీ ఓపినింగ్స్ తో మొదలయ్యే వాతావరణం నెలకొని ఉంది. దాదాపు అన్ని చోట్లా వారం రోజులకు టిక్కెట్ల్ బుక్ అయిపోయాయి. ఇక ఈ చిత్రాన్ని 425 ప్రింట్లతో 815 ధియోటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ కి ఇస్తున్న బర్తెడే (ఏప్రియల్ 7) కానుక అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం వాస్తవ పరిస్ధితి ఏమిటీ..హిట్ అయితే ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది మరో కొద్ది గంటల్లో తేలనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu