For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నితిన్ కు చెల్లిలుగా ఓకే...మిగతా హీరోలు అదే రూటులో

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినీ పరిశ్రమలో ఒక సారి ఒక వేషానికి ఒప్పుకుంటే కంటిన్యూగా అదే వేషాలు వస్తూంటాయి. అందుకే ఆర్టిస్టులు ఆచితూచి అడుగులు వేస్తూంటారు. ఇప్పుడు అలాంటి సమస్యే హీరోయిన్ అనన్యకు వచ్చిందని సమాచారం.

  'జర్ని' నీనిమాలో అంజలి తరువాత మరో హీరోయిన్ అనన్య గుర్తుంది కదా? ఆ నీనిమా తరువాత అనన్య పెద్దగా నీనిమాలు చేయలేదు. పెళ్ళి చేసుకుని సెటిల్ ఆవుదామనుకుంది. అది కాస్తా రివర్స్ కావడంతో ఇప్పుడు తిరిగి నీనిమాల మీద దృష్టి పెట్టిందట.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నీనిమా ఆ ఆ నీనిమాలో నితిన్ కు సోదరిగా కనిపించనుందట. పేరుకు చెల్లి పాత్రే అయినా నీనిమాలో పవర్పల్ క్యారెక్టర్ కావడంతో ఒప్పకున్నానని చెబుతోంది అనన్య . అయితే ఇప్పుడు మరిన్ని చెల్లి ఆఫర్స్ ఆమె దగ్గరకు వస్తూండటంతో ఆమె డైలమోలో పడిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

  పెళ్ళి చేసుకున్న హీరోయిన్లకు అక్కా, చెల్లి క్యారెక్టర్లు కాకుంటే హీరోయిన్ క్యారెక్టర్లు వస్తాయా? అంటున్నారు టాలీవుడ్ జనాలు. కరెక్టే కానీ ఏదో పెద్ద దర్శకుడు, హీరో కదా ఒప్పుకుంటే ఇదెక్కడ తలనొప్పిరా అని తలపట్టుకుందిట అనన్య.

  Ananya As Nitin's Sister In A...Aa

  చిత్రం మరిన్ని విశేషాలకు వెళ్తే..

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా 'అ ఆ' టైటిల్ తో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. 'అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి' అనేది ఉపశీర్షిక. సమంత హీరోయిన్. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ప్లానింగ్ ప్రకారమే నితిన్ త్రివిక్రమ్ లు ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో అ..ఆ మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసారు.

  అలాగే చిత్రాన్ని వచ్చే జనవరి 16న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించామని ప్రకటించారు. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి.... ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాని షూట్ చేసి జనవరికల్లా సినిమాని ఫినిష్ చేసి లవర్స్ డే కానుకగా ప్రేమికుల రోజున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

  ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

  నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

  ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

  English summary
  Ananya who shot to fame with Journey film in Tollywood is all set to entertain Telugu audience next year with a key role in A..Aa-Anasuya Ramalingam vs Anand Vihari. now the actress is back with the character of Nithin's sister in A..Aa film. Ananya will be joining the sets of the film soon and wrap up her portion of shoot at a brisk pace.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X