»   » అల్లు అర్జున్-వక్కతం వంశీ మూవీలో అను ఇమ్మాన్యుయేల్?

అల్లు అర్జున్-వక్కతం వంశీ మూవీలో అను ఇమ్మాన్యుయేల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆగస్టు మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... అను ఇమ్మాన్యుయేల్‌ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందని, దాదాపుగా ఆమె ఖరారైనట్లే అని సమాచారం. అయితే అఫీషియల్ సమాచారం మాత్రం ఇంకారాలేదు. 'మజ్ను' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Anu Emmanuel confirmed as Allu Arjun's heroine

ఈ చిత్రానికి 'నా పేరు సూర్య' అనే టైటిల్ ఖరారు చేశారు. నా ఇల్లు ఇండియా అనేది సబ్ టైటిల్. రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దేశభక్తికి సంబంధించిన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు.

బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ మ్యూజిక్ అందించబోతున్నారు. రాజీవ్ రవి, రాజీవన్ లాంటి పాపులర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

Allu Arjun sharing his Emotion Towards Dil Raju for Losing his Wife
English summary
Anu Emmanuel confirmed as Allu Arjun's heroine. She has now bagged 'Na Peru Surya'. To be directed by Vakkantham Vamsi, the patriotic drama will see her romancing Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X