»   » లారెన్స్‌ ‘కాంచనమాల’ గా జేజమ్మ!

లారెన్స్‌ ‘కాంచనమాల’ గా జేజమ్మ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని కాంబినేషన్లు ప్రారంభానికి ముందునుంచే ఆసక్తిని రేకెత్తిస్తాయి. 'అరుంధతి" చిత్రంతో ఆకాశానికి నిచ్చెన వేసిన 'సూపర్‌" హీరోయిన్‌ అనుష్క ప్రస్తుతం 'పంచాక్షరి" చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తోంది అదలా వుంటే 'మాస్"‌, 'స్టైల్‌" చిత్రాలతో తనదైన మార్క్‌ ప్రదర్శించిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాఘవేంద్ర లారెన్స్‌ హీరోగా కూడా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం లారెన్స్‌ 'సూపర్‌ కౌబాయ్‌" అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అయితే అనుష్క కథానాయికగా లారెన్స్‌ దర్శత్వంలో 'కాంచన" అనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. వీరిద్దరూ నాగార్జున నటించిన డాన్ చిత్రంలో లారేన్స్, అనుష్క పెర్ఫామెన్స్ కి ప్రేక్షకులు భాగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ వారి వారి చిత్రాల్లో బిజీగా వున్నప్పటికీ ఈ 'కాంచన" చిత్రం గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతూనే వుందట. త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu