»   » భూమికను భయపెడ్తున్న భరత్ ఠాకూర్

భూమికను భయపెడ్తున్న భరత్ ఠాకూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

భూమిక బిజెనెస్ ఉమెన్ గా అవతారం ఎత్తటానికి ఆమె భర్త భరత్ ఠాకూర్ వెనక ఉండటమేనని అందరికీ తెలిసిందే. అయితే ఆమె ప్రారంభించిన డౌన్ టౌన్ ప్రొడక్షన్స్ వారి సినిమా తకిట తకిట ప్రారంభమై సంవత్సరం దాటుతున్నా ఓ కొలిక్కి రాలేదు. అలాగే ఆ తర్వాత భరత్ ఠాకూర్ ఆవేశంగా ప్రకటించిన నాటు కోడి పులుసు సినిమా అస్సలు ప్రారంభమే కాలేదు. అంతేగాక కాస్టింగ్ కాల్ ఇచ్చి మరీ ఆర్టిస్టులను పిలిచి ఎంపిక చేసిన ప్రాజెక్టులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మరో ప్రక్క ఎంతో అట్టహాసంగా సినీ ప్రముఖలందరినీ పిలిచి ప్రారంభించిన మాయాబజార్ పత్రిక పూర్తి నష్టాల్లో కూరుకు పోయి ఆగిపోయింది. అలాగే ఆ తర్వాత ఎనర్జికర్ అనే మినిరల్ వాటర్ ప్లాంటుని ప్రారంభించారు. అదీ ముందుకు పోక నష్టాలే తెస్తోంది. రెడ్ వెల్వెట్ పేరుతో కాస్ట్యూమ్ డిజైనింగ్ కంపెనీని ప్రారంభించాడు. అదీ ఇవాళా రేపు అన్నట్లు ఉందని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూసిన భూమిక తమకు బిజెనెస్ అచ్చిరావటం లేదని, అలాగే భరత్ కు యోగా, తనకు నటన అంటూ ఎవరి వ్యాపకాలు వారికి ఉండటంతో వ్యాపారంపై దృష్టి పెట్టలేకపోతున్నామని ఫీలవుతోందని చెప్తున్నారు. ఇదిలా ఉంటే భరత్ ఠాకూర్ మరిన్ని బిజెనెస్ ప్లాన్ లతో ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు. దాంతో భూమిక తన భర్త బిజెనెస్ ప్లాన్ లు చూసి భయపడుతోందని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu