»   » ప్రభాస్‌,సుజీత్ సినిమాకు భారీ స్కెచ్, బిజినెస్ యాంగిల్ లో?

ప్రభాస్‌,సుజీత్ సినిమాకు భారీ స్కెచ్, బిజినెస్ యాంగిల్ లో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌.. సుజిత్‌ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని పెట్టడంతో పాటు భారీగా బిజినెస్ సైతం చేయాలని నిర్ణయించుకున్నారు.

అందులో భాగంగా ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం బాలీవుడ్‌ నటులు వివేక్‌ ఒబెరాయ్‌, జాకీ ష్రాఫ్‌లను ఎంపిక చేసినట్లు తెలుగు సిని వర్గాల సమాచారం. దీని గురించి జాకీ, వివేక్‌లతో సంప్రదింపులు జరిపారని త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సినిమా మూడు భాషల్లో తెరకెక్కనుండటంతో జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న వివేక్‌, జాకీను తీసుకోనున్నారట. అదీకాకుండా వివేక్‌ 'రక్తచరిత్ర'తో, జాకీ ష్రాఫ్‌ 'పంజా', 'శక్తి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. హీరోయిన్‌ని కూడా బాలీవుడ్‌ నటినే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతోంది. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు.

Bollywood stars in Prabhas movie?

అలాగే నిర్మాతలు యువి క్రియేషన్స్ వారు, దర్శకుడు సుజీత్ కలిసి ఈ చిత్రం టీజర్ విషయమై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది..ముందుగా ..టీజర్ సీన్స్ షూట్ చేసి, తర్వాత రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించదలిచారు. మార్చి నెలలో టీజర్ కొన్ని సీన్స్ ప్రభాస్ పై తీసి,'బాహుబలి2'చిత్రం తో ఎటాచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఎందుకంటే బాహుబలి 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ధియోటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అలాంటి సినిమాతో తమ టీజర్ వస్తే... సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వస్తుంది. ఈ సూపర్ స్కెచ్ కు ప్రభాస్ సైతం ఫిదా అయ్యి..వెంటనే టీజర్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అలాగే ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త లుక్ లో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా కాలం నుండి ఈ ప్రాజెక్ట్ మీదే కష్టపడుతూ మంచి స్క్రిప్ట్ ను తయారు చేసుకున్నాడు. యూవి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దాదాపు రూ. 150 కోట్ల తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకే సారి చిత్రకరించనున్నారు.

యూవి క్రియేషన్స్ సంస్థలో ప్రొడక్షన్ నెం. 6గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే మంచి అకేషన్ చూసి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది.

చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి లవ్ స్టోరీగా ఉంటుందని తెలుస్తోంది. మూడు లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని భావిస్తోన్న ఈ సినిమాని రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టిన సుజీత్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. మ్యూజిక్: శంకర్ ఇషాన్, ఫొటోగ్రఫీ: మాధీ.

English summary
Prabhas and UV Creations have now decided to make this new action adventure in Hindi language as well to cash in on the craze he has in Bollywood market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu